Indrakeeladri Temple: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రులలో కనకదుర్గమ్మ ఇవాళ 4వ రోజు శ్రీలలితా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు విచ్చేస్తున్నారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. అన్నప్రసాదం, లడ్డు ప్రసాదం ఎప్పటికప్పుడు ఆలయ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులకు పాలు, తాగునీరు, మెడికల్ వసతులను ఏర్పాటు చేసారు. కొండ దిగువన పున్నమి ఘాట్ వద్ద నుంచి వీఐపీ దర్శనం భక్తులకు వాహనాలను అనుమతిస్తున్నారు. క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు పోలీసు సేవాదళ్, రెడ్ క్రాస్ వాలంటీర్లు చర్యలు చేపడుతున్నారు. దుర్గమ్మ భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Read Also: Good Night Tips: రాత్రి పడుకునే ముందు ఈ పని చేయడం లేదా..?