Srisailam: శ్రీశైలంలో ఈనెల 15 నుంచి 24 వరకు దసరా దేవి శరన్నవరాత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam: శ్రీశైలంలో ఈనెల 15 నుంచి 24 వరకు దసరా దేవి శరన్నవరాత్రులు జరగనున్నాయి. దసరాకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, వసతి కల్పిస్తామని శ్రీశైలం ఆలయ ఈవో వెల్లడించారు. ఉత్సవాల సమయంలో కుంకుమార్చన, అభిషేకాలు, కల్యాణోత్సవం యధావిధిగా కొనసాగనుంది. 15న ఉదయం శ్రీస్వామివారి అమ్మవారి యాగశాలల ప్రవేశంతో దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ప్రతి రోజు వివిధ అలంకారాలతో వివిధ వాహన సేవలను స్వీకరించనున్నారు.
9 రోజుల పాటు అలంకారాలు, వాహనసేవలు ఇవే..
*15న శైలపుత్రి అలంకారం, బృంగివాహన సేవ
Also Read
*16న బ్రహ్మచారిణి అలంకారం, మయూరవాహన
*17న చంద్రఘంట అలంకారం,రావణవాహన
*18న కూష్మాండదుర్గ అలంకారం,కైలాసవాహన
*19న స్కందమాత అలంకారం,శేషవహనం
*20న కాత్యాయని అలంకారం హంసవహననంపై పుష్పపల్లకిసేవ
*21న కళరాత్రి అలంకారం, గజవాహన
*22న మహాగౌరి అలంకారం, నందివాహన
*23న సిద్ధిదాయిని అలంకారం, అశ్వవాహనసేవ, రాష్ట్ర ప్రభుత్వంచే పట్టు వస్త్రాల సమర్పణ
*24న విజయదశమి శ్రీస్వామి అమ్మవారికి నందివాహనంపై ఆలయ ఉత్సవం జమ్మివృక్షం వద్ద శమి పూజలు నిర్వహించనున్నారు. రాత్రి ఆలయ పుష్కరిణిలో శ్రీస్వామి అమ్మవారి తెప్పోత్సవంతో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి.
హుండీ లెక్కింపు
శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండీని అధికారులు లెక్కించారు. 28 రోజుల మల్లన్న హుండీ ఆదాయం 3 కోట్ల 17 లక్షల 50 వేల 209 నగదు రాగా.. బంగారం 187 గ్రా., 6 కేజీల వెండి, వివిధ విదేశీ కరెన్సీ లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!