మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను రాజ్యసభ ఎంపీగా చేయాలని హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. రాజ్యసభలో నలుగురు నామినేటెడ్ సభ్యుల సీట్లు ఖాళీగా ఉన్నాయని.. వాటిని రాష్ట్రపతి త్వరలో నలుగురు సభ్యులను నామినేట్ చేస్తారని దుష్యంత్ చౌతాలా తెలిపారు. భారతదేశపు గొప్ప క్రికెటర్ సచిన్ టెండూల్కర్ లాగా, దేశ వీర కుమార్తె వినేష్ ఫోగట్‌ను కూడా రాష్ట్రపతి.. ప్రధానమంత్రి రాజ్యసభకు నామినేట్ చేయాలన్నారు. తద్వారా యువత, మహిళలు.. క్రీడాకారుల బలమైన గొంతు దేశ పార్లమెంటులో వినపడుతుందని ఆయన చెప్పారు.
Karnataka High Court: ఆ ఉద్యోగులు పుట్టిన తేదీని మార్చుకోలేరు.. కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం
వినేష్ ఫోగట్ లాంటి అంతర్జాతీయ రెజ్లర్.. పార్టీ రాజకీయాలు, ఎన్నికల జోలికి వెళ్లకూడదని దుష్యంత్ చౌతాలా అన్నారు. వినేష్ ఫోగట్‌కు రాజ్యసభకు నామినేట్ కావడమే నిజమైన గౌరవం అని, ఆమె దానికి అర్హురాలని ఆయన పేర్కొన్నారు. వినేష్ ఫోగట్ ఆగస్టు 25న నామినేషన్ వేయడానికి అన్ని అర్హతలను పూర్తి చేస్తారని, అటువంటి పరిస్థితిలో వినేష్‌ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయాలని దుష్యంత్ చౌతాలా డిమాండ్ చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడినందుకు యావత్ భారతదేశం విచారం వ్యక్తం చేసిందని.. ఎందుకంటే దేశం పతకం కోల్పోయిందని దుష్యంత్ చౌతాలా చెప్పారు. నేడు దేశప్రజలందరి మనోభావాలను పరిగణలోకి తీసుకుని దేశ పుత్రిక వినేష్‌ను ప్రోత్సహించేందుకు ఆమెను రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయాలని పేర్కొన్నారు.
Kolkata Doctor case: నిందితుడి గురించి వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు
హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సంఖ్యా బలం ఉంటే రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను రాజ్యసభకు నామినేట్ చేసేవాడినని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా గురువారం తెలిపారు. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయని ఆయన అన్నారు. తమకు మెజారిటీ లేదు, లేకుంటే తానే ఆమెను నామినేట్ చేసేవాడినన్నారు. భూపేంద్ర సింగ్ హుడా ప్రకటనపై వినేష్ ఫోగట్ కోచ్, మామ మహావీర్ ఫోగట్ స్పందిస్తూ.. ఇది రాజకీయ స్టంట్ అని అన్నారు. వినేష్‌ను రాజ్యసభకు పంపాలని అంటున్న మాజీ సీఎం.. గీతా ఫోగట్‌ను ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. 2005, 2010లో కామన్వెల్త్ క్రీడలు జరిగినప్పుడు గీతా ఫోగట్‌ను తమ ప్రభుత్వ హయాంలో ఎందుకు రాజ్యసభకు పంపలేదని అన్నారు. బబితా ఫోగట్ రజత పతకాన్ని, గీతా ఫోగట్ బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. గీత ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మొదటి మహిళా రెజ్లర్‌గా నిలిచింది. ఆ సమయంలో హుడా ప్రభుత్వం ఉంది.. గీత, బబితను డీఎస్పీ (DSP)గా చేయవలసి ఉంది. కానీ హుడా వివక్ష చూపి గీతను ఇన్‌స్పెక్టర్‌గా.. బబితను సబ్-ఇన్‌స్పెక్టర్‌గా చేశారన్నారు. ఆ తరువాత తాము దీనిపై కేసు దాఖలు చేసామని.. సమస్యను కోర్టు ద్వారా పరిష్కరించుకున్నామని తెలిపారు.