Site icon NTV Telugu

Dunki : షారుఖ్ ఖాన్ డంకీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?

Whatsapp Image 2023 12 04 At 8.31.34 Pm

Whatsapp Image 2023 12 04 At 8.31.34 Pm

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది రెండు భారీ  బ్లాక్‍ బాస్టర్ హిట్స్ అందుకున్నారు.ఆయన నటించిన పఠాన్ మరియు జవాన్ సినిమాలు ఈ ఏడాది ఏకంగా రూ.1,000కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి భారీ విజయం అందుకున్నాయి.ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ ‘డంకీ’.. ఈ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‍కుమార్ హిరాని తెరకెక్కించారు. ఈ దర్శకుడు గతంలో 3 ఇడియట్స్, పీకే వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.దీనితో డంకీ సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి.ఇదిలా ఉంటే డంకీ సినిమా ట్రైలర్ రిలీజ్‍ గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.డంకీ సినిమా ట్రైలర్ రేపు (డిసెంబర్ 5) రిలీజ్ కానుందని సమాచారం.ఈ విషయంపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.

డంకీ నుంచి ఇప్పటి వరకు డ్రాప్ అనే పేరుతో వరుస అప్డేట్స్ ఇచ్చిన మూవీ యూనిట్ డంకీ ట్రైలర్ ను కూడా ‘డంకీ డ్రాప్ 4’గా విడుదల చేస్తుందని సమాచారం.డంకీ సినిమా రిలీజ్ కు ఇంకా 16 రోజులే ఉన్న తరుణంలో ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ సిద్ధం అయింది. డంకీ కథ గురించి ముఖ్యమైన పాయింట్స్ ఈ ట్రైలర్‌లో ఉంటాయని తెలుస్తుంది.విదేశాలకు వీసా లేకుండా వెళ్లాలని అనుకునే స్నేహితుల కథే డంకీ అని సమాచారం.. తమ కలను సాకారం చేసుకునే క్రమంలో వారి జీవితం ఎలా మారిందన్నదే ప్రధాన కథగా ఉంటుంది. కామెడీ, లవ్, ఫ్రెండ్‍షిప్ మరియు ఎమోషన్స్ తో డైరెక్టర్ రాజ్‍కుమార్ హిరానీ మార్క్ చిత్రంగా ఉండనుందని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది.డంకీ చిత్రంలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బొమ్మన్ ఇరానీ మరియు విక్రమ్ కొచ్చర్ కీలకపాత్రల్లో నటించారు. ప్రితమ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‍మెంట్స్, రాజ్‍కుమార్ హిరానీ, ఫిల్మ్స్ మరియు జియో స్టూడియోస్ బ్యానర్లు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించాయి

Exit mobile version