బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘డంకీ’. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 21 న విడుదల అయింది.భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాల్ని అందుకోలేక డీలా పడింది.థియేటర్లలో మోస్తారు వసూళ్లను రాబట్టింది.గత ఏడాది షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన పఠాన్ మరియు జవాన్ సినిమాలు నిర్మాతలకు భారీగా కాసుల వర్షం కురిపించాయి. రెండు సినిమాలు వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడంతో డంకీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. డంకీ ఓటీటీ హక్కులను జియో సినిమా 155 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. బాలీవుడ్‌లో అత్యధిక ధరకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా డంకీ రికార్డ్ క్రియేట్ చేసింది. షారుఖ్ కెరీర్‌లో కూడా హయ్యెస్ట్ రేట్‌కు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన పోయిన మూవీగా డంకీ మూవీ నిలిచింది.
ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను టీ సిరీస్ 36 కోట్లకు కొనుగోలు చేసింది.ప్రభాస్ సలార్‌కు పోటీగా ఈ మూవీ రిలీజ్ అయింది.. షారుఖ్‌ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ కాంబోపై ఉన్న క్రేజ్ కారణంగా రిలీజ్‌కు ముందు డంకీ మూవీపై భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. కానీ రొటీన్ స్టోరీలైన్ కారణంగా ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.ఇదిలా ఉంటే ఈ సినిమా ఫిబ్రవరి 16 నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.. డంకీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను జియో సినిమా త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్‌చేయబోతున్నట్లు సమాచారం.డంకీ సినిమాలో తాప్సీ హీరోయిన్‌గా నటించింది.విక్కీ కౌశల్ గెస్ట్ రోల్ చేశాడు. విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ మరియు బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ అక్రమంగా విదేశాలకు వలస వెళుతోన్న వారి జీవితాల నేపథ్యంలో డంకీ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో హర్ దయాల్ సింగ్ అలియాస్ హర్డీ సింగ్ గా ఎమోషనల్ రోల్‌లో షారుఖ్‌ఖాన్ కనిపించాడు.
