Site icon NTV Telugu

Duleep Trophy 2025: రజత్ పటీదార్‌ కెప్టెన్సీ మాయ.. దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్!

Rajat Patidar's Captaincy

Rajat Patidar's Captaincy

టీమిండియా బ్యాటర్ రజత్ పటీదార్‌ తన కెప్టెన్సీ మాయను మరోసారి చూపాడు. ఐపీఎల్‌ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను విజేతగా నిలిపిన పటీదార్‌.. దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్‌ ట్రోఫీ 2025లో సెంట్రల్‌ జోన్‌కు టైటిల్ అందించాడు. ఫైనల్‌లో సౌత్‌ జోన్ నిర్దేశించిన 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సెంట్రల్ జోన్‌ ఏ వికెట్లను కోల్పోయి ఛేదించింది. పటీదార్‌ నాయకత్వంలో వరుసగా రెండో టైటిల్‌ను సెంట్రల్ జోన్ గెలిచింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరగగా.. యశ్ రాథోడ్ (194) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సెంట్రల్‌ జోన్ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. సారాన్ష్‌ జైన్ 5, కుమార్ కార్తికేయ 4 దెబ్బకు సౌత్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌటైంది. సౌత్‌ జోన్‌ బ్యాటర్లలో తన్మయ్ అగర్వాల్ (31) టాప్ స్కోరర్. ఆపై సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 511 రన్స్ చేసింది. యశ్ రాథోడ్ (194) భారీ సెంచరీ చేయగా.. రజత్ పటీదార్‌ (101) శతకం బాదాడు. అంకిత్ శర్మ 4, గుర్జప్‌నీత్ సింగ్ 4 వికెట్స్ తీశారు.

Also Read: IND vs PAK: పనికిమాలిన ప్లేయర్స్, డబ్బులు బొక్క.. ఇకపై మ్యాచ్ మేం చూడం!

తొలి ఇన్నింగ్స్‌లో 362 పరుగులు వెనకబడిన సౌత్‌ జోన్.. రెండో ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేయగలిగింది. అంకిత్ శర్మ (99), స్మరన్ రవిచంద్రన్ (67), ఆండ్రూ సిద్దార్థ్ (84) హాఫ్ సెంచరీలు బాదారు. రెండో ఇన్నింగ్స్‌లో సౌత్‌ జోన్భారీ స్కోర్ చేసినా.. సెంట్రల్ జోన్ ముందు 65 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. స్వల్ప లక్షాన్ని సెంట్రల్‌ జోన్ 20.3 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. వరుసగా రెండో టైటిల్ అందించిన పటీదార్‌పై ఆర్సీబీ ఫాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తన్నారు. ఇక ఆర్సీబీ రాత మారినట్లే అని కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version