NTV Telugu Site icon

Duleep Trophy 2024: శుభమాన్ గిల్ స్థానంలో తెలుగు ఆటగాడు.. ఎట్టకేలకు ఇషాన్‌ కిషన్‌కు చోటు!

Duleep Trophy 2024

Duleep Trophy 2024

దులీప్ ట్రోఫీ 2024లో రెండో రౌండ్‌ మ్యాచ్‌లు ఆరంభం అయ్యాయి. అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియాల్లో నాలుగు భారత జట్లు తలపడుతున్నాయి. ఇండియా ఎ, ఇండియా డి జట్లు.. ఇండియా బి, ఇండియా సి టీమ్స్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఇండియా-సిపై టాస్‌ నెగ్గిన ఇండియా బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. బీసీసీఐ ఆగ్రహానికి గురైన వికెట్ కీపర్ ఇషాన్‌ కిషన్‌ ఎట్టకేలకు దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

మరో మ్యాచ్‌లో ఇండియా ఎపై ఇండియా డి టాస్‌ గెలిచింది. ఇండియా డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. డి జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో సంజూ ఆడని విషయం తెలిసిందే. ఇక శుభమాన్ గిల్ భారత జట్టుకు ఎంపిక కావడంతో ఇండియా ఎ సారథ్య బాధ్యతలను మయాంక్ అగర్వాల్ తీసుకున్నాడు. గత మ్యాచ్‌లో ఆడని తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు చోటు దక్కింది. శివమ్ దూబే, అవేశ్ ఖాన్‌లు తుది జట్టు నుంచి తప్పించబడ్డారు.

తుది జట్లు:
ఇండియా ఎ: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, షామ్స్‌ ములాని, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, కుమార్‌ కుషాగ్రా, ప్రతామ్‌ సింగ్, ఆకిబ్ ఖాన్, ప్రతామ్‌ సింగ్‌, రావత్.
ఇండియా డి: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, దేవదుత్ పడిక్కల్, రికీ భుయ్, సారాన్ష్‌ జైన్, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, సౌరభ్ కుమార్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), విద్వత్ కవేరప్ప.

Also Read: Malaika Arora: ఆత్మహత్య చేసుకునేముందు.. మలైకా అరోరాకు ఫోన్‌ చేసిన ఆమె తండ్రి!

ఇండియా సి: రుతురాజ్‌ గైక్వాడ్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సాయి సుదర్శన్‌, రజత్ పటీదార్, బాబా ఇంద్రజీత్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, అన్షుల్ కంబోజ్, మయాంక్‌ మార్కండె, విజయ్‌కుమార్ వైశాక్, సందీప్ వారియర్.
ఇండియా బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), జగదీశన్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, సర్ఫరాజ్‌ ఖాన్, రింకు సింగ్, నితీశ్‌ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, సాయి కిశోర్, నవ్‌దీప్ సైని, ముకేశ్‌ కుమార్, రాహుల్ చాహర్.

 

Show comments