NTV Telugu Site icon

Duleep Trophy 2024: ఇండియా-ఎలో 10 మంది టీమిండియా ప్లేయర్స్.. తెలుగోడికి దక్కని చోటు!

India A Vs India B

India A Vs India B

India A Playing 11 vs India B: ప్రతిష్ఠాత్మక దులీప్‌ ట్రోఫీ 2024 ప్రారంభమైంది. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో భాగంగా బెంగళూరులోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇండియా-ఎ, ఇండియా-బి మధ్య మ్యాచ్ ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇండియా-ఎ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఇండియా-బి బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్ బ్యాటింగ్ చేస్తున్నారు. 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 రన్స్ చేశారు.

ఇండియా-ఎలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దక్కలేదు. మిడిల్ ఆర్డర్‌లో రియాన్ పరాగ్, శివమ్ దూబేలతో పోటీ ఉన్నా.. తుది జట్టులో తిలకే ఉంటాడని అందరూ ఊహించారు. కానీ వారిద్దరే చోటు దక్కగా.. మనోడికి షాక్ తగిలింది. మయాంక్ అగర్వాల్ జతగా శాశ్వత్ రావత్ ఓపెనర్‌గా వస్తదనుకున్నా.. అతడికి అవకాశం దక్కలేదు. కెప్టెన్‌ శుభ్‌మ‌న్ గిల్ ఓపెనర్‌గా ఆడనున్నాడు. స్పిన్ కోటాలో కుల్దీప్ యాదవ్ సహా తనుష్ కోటియన్‌ ఆడుతున్నాడు. పేస్ కోటాలో ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకు చోటు దక్కింది. కేఎల్ రాహుల్ మూడో స్థానంలో బరిలోకి దిగుతున్నాడు.

Also Read: Simbaa OTT: ఓటీటీలోకి అనసూయ క్రైమ్‌ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇండియా-ఎలో జట్టులో అందరూ స్టార్లే. భారత జట్టుకు ఆడిన 10 మంది జట్టులో ఉన్నారు. తనుష్ కోటియన్‌ మినహా అందరూ టీమిండియాకు ఆడినవారే. రియాన్ పరాగ్, ఆకాష్ దీప్, ధృవ్ జురెల్ ఇటీవల జట్టులోకి వచ్చారు. ఇండియా-బి జట్టులో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.

ఇండియా-ఎ తుది జట్టు:
మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, ధ్రువ్ జురెల్ (కీపర్), తనుష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌.

Show comments