NTV Telugu Site icon

Duleep Trophy 2024: దేశవాళీ టోర్నీ ‘దులీప్ ట్రోఫీ’కి రంగం సిద్ధం.. మ్యాచుల షెడ్యూల్ ఇదే..

Duleep Trophy 2024 (1)

Duleep Trophy 2024 (1)

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024 గురువారం (సెప్టెంబర్ 5)న ప్రారంభం కానుంది. ఈ రెడ్ బాల్ టోర్నమెంట్ రెండు నగరాల్లో జరగనుంది. మొదటి రోజు రెండు మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఈ రెండు మ్యాచ్‌లు ముఖ్యమైనవి. ఎందుకంటే, బంగ్లాదేశ్‌తో భారత జట్టు ఎంపిక ఈ మ్యాచ్‌ లపై ఆధారపడి ఉంటుంది. మంచి ప్రదర్శన కనబరిచే ఆటగాళ్లకు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. దీనికి ముందు, దులీప్ ట్రోఫీ ఈ సీజన్ షెడ్యూల్ ఎలా ఉంది..? ఏ జట్లు మ్యాచ్‌లు ఆడతాయి, ఏ జట్టులో ఆటగాళ్ళు ఉన్నారు, ఎక్కడ మ్యాచ్‌లు ఆడతారు లాంటి వివరాలను చూద్దాం.

దులీప్ ట్రోఫీ 2024 పూర్తి షెడ్యూల్:

సెప్టెంబర్ 5 నుండి 8 వరకు – టీమ్ A vs టీమ్ B – M చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు.

సెప్టెంబర్ 5 నుండి 8 వరకు – టీమ్ C vs టీమ్ D – రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం, అనంతపురం.

సెప్టెంబర్ 12 నుండి 15 వరకు – టీమ్ A vs టీమ్ D – రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం, అనంతపురం.

సెప్టెంబర్ 12 నుండి 15 వరకు – టీమ్ B vs టీమ్ C – ACA ADCA గ్రౌండ్, అనంతపురం.

సెప్టెంబర్ 19 నుండి 22 వరకు – టీమ్ B vs టీమ్ D – ACA ADCA గ్రౌండ్, అనంతపురం.

సెప్టెంబర్ 19 నుండి 22 వరకు – టీమ్ A vs టీమ్ C – రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం, అనంతపురం.

ఇకపోతే భారత వైట్‌బాల్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టీమ్‌ Aకి కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, దేశీయ క్రికెట్‌లో అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ అభిమన్యు ఈశ్వరన్ టీమ్ Bకి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టీమ్ Cకి, 2024 ఐపిఎల్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ D జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఆయా జట్లపై ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియా A: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ర్యాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), KL రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వాత్ కవేరప్ప , కుమార్ కుశాగ్రా మరియు శాశ్వత్ రావత్.

ఇండియా B: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తీ మరియు ఎన్ జగదీషన్ (వికెట్ కీపర్).

ఇండియా C: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), బి ఇందర్‌జీత్, హృతిక్ షౌకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, విశాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్) మరియు సందీప్ వారియర్.

ఇండియా D: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ స్ంగ్‌పాండే . (వికెట్ కీపర్) మరియు సౌరభ్ కుమార్.