Anshul Kamboj: దులీప్ ట్రోఫీలో ఇండియా-బితో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఇండియా-సి ఆటగాడు అన్షుల్ కాంబోజ్ అద్భుత బౌలింగ్ చేశాడు. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్ కాంబోజ్ ఏకంగా 8 వికెట్లు తీశాడు. ఇది అతని ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అతని అద్భుతమైన బౌలింగ్ కారణంగా ఇండియా-బి ఇన్నింగ్స్ 332 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్-బి జట్టు 193 పరుగుల ఆదిత్యాన్ని సంపాదించుకుంది.
Teeth Problems: పంటి నొప్పితో సమస్యలా.. ఇలా చేసి ఉపశమనం పొందండి..
నారాయణ్ జగదీషన్ (70)ను ఔట్ చేయడం ద్వారా కాంబోజ్ తన వికెట్ల ఖాతా తెరిచాడు. దీని తర్వాత అతను మూడో రోజు ముషీర్ ఖాన్ (1), సర్ఫరాజ్ ఖాన్ (16), రింకు సింగ్ (6), నితీష్ రెడ్డి (2)ల వికెట్లు పడగొట్టడం ద్వారా తన 5 వికెట్ల పతకాన్ని పూర్తి చేశాడు. ఇక మ్యాచ్ నాలుగో రోజు ఆటలో అతను రాహుల్ చాహర్ (18), నవదీప్ సైనీ (0), ముఖేష్ కుమార్ (4) వికెట్లు పడగొట్టాడు. 27.5 ఓవర్లలో 69 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. ఇకపోతే దులీప్ ట్రోఫీ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన మూడో ఫాస్ట్ బౌలర్ కాంబోజ్. అంతకుముందు దేబాశిష్ మొహంతి (10/46), అశోక్ దిండా (8/123) ఈ ఘనత సాధించారు.
Union Bank of India: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ రిక్రూట్‌మెంట్.. 500 పోస్టులకు
ఈ మ్యాచ్‌లో ఇండియా-సి తన తొలి ఇన్నింగ్స్‌లో 525 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. ఇండియా-Cలో ఇషాన్ కిషన్ సెంచరీ (111) చేశాడు . అతనితో పాటు మానవ్ సుతార్ లోయర్ ఆర్డర్‌లో 82 పరుగులు చేశాడు. భారీ స్కోరుకు సమాధానంగా ఇండియా-బి జట్టు 332 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 157 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియా-C తరఫున కాంబోజ్‌తో పాటు విజయ్‌కుమార్, మయాంక్ మార్కండే ఒక్కో వికెట్ తీశారు.