Site icon NTV Telugu

Dulam Nageswara Rao: ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు..

Dulam

Dulam

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు తమ నియోజకవర్గంలో ప్రచారంలో జోరు పెంచారు. కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్లి తమ పార్టీ అందించే సంక్షేమ పథకాలు, తమ పార్టీకి ఓటు వేయడం ద్వారా భవిష్యత్ లో కలిగే లాభాలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏపీలో రాజకీయ పార్టీల నేతలంతా ప్రతీరోజు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థికి ఓటేయాలని కోరుతున్నారు.

AP Elections 2024: ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..

ఈ క్రమంలో.. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు అనుపమ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేయమని ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దూలం నాగేశ్వరరావు మద్ధతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతున్నానని తెలిపారు. ప్రతి గడపకు తిరుగుతుంటే ప్రతి మహిళ వారికి అందుతున్న పథకాలకు సంతృప్తి చెంది మరల దూలం నాగేశ్వరావును దీవిస్తామని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారని పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థికి ఒక ఓటు, ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక ఓటు.. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకి వేయమని ఓట్ల అభ్యర్థిస్తున్నాని చెప్పారు. కోరుకొల్లు గ్రామం నుండి ఫ్యాన్ గుర్తుకి అఖండ మెజార్టీ చేకూరుతాయని కలిదిండి ఎంపీపీ అభిప్రాయపడ్డారు.

Exit mobile version