Site icon NTV Telugu

Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఒడిశాలో భారీ వర్షాలు

Odisha Rains

Odisha Rains

ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో గత 24 గంటల్లో వర్షాలు దంచికొట్టాయి. భువనేశ్వర్, కటక్ జంట నగరాలతో సహా ఒడిశాలోని 18 జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలావుండగా.. అన్ని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలనీ, లోతట్టు ప్రాంతాల్లో తాత్కాలికంగా నీరు నిలవడం, తీవ్రమైన వర్షాల సమయంలో దృశ్యమానత తక్కువగా ఉండటం, పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ తెలిపింది.

ASP: మరీ అంత అర్జెంట్ కాలా సారూ… ఫోన్‌ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్ చేసిన ఏఎస్పీ

వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడిందనీ, సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు చురుగ్గా ఉందనీ, రాగల రెండు మూడు రోజుల పాటు పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్ గఢ్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Muralidhar Rao: అవినీతి చేసినోళ్లు అంతా జైలుకు పోవాల్సిందే

అల్పపీడన ప్రభావంతో.. రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలోని టెల్కోయ్ (182.6 మిల్లీ మీట‌ర్లు), కటక్ జిల్లాలోని బంకి (182 మిల్లీ మీట‌ర్లు), బోలంగీర్ జిల్లాలోని గుడ్వెల్లా (139.8 మిల్లీ మీట‌ర్లు), పూరీ జిల్లాలోని పిపిలి (122మిల్లీ మీట‌ర్లు) ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైందని స్థానిక వాతావరణ కార్యాలయం తెలిపింది. మరోవైపు మయూర్‌భంజ్, భద్రక్, బాలాసోర్, కేంద్రపాడ, జగత్‌సింగ్‌పూర్, నయాఘర్, ధెంకనల్, అంగుల్, జాజ్‌పూర్, కియోంజర్, ఖుర్దా, కటక్, పూరి, గంజాం, గజపతి, కోరాపుట్, రాయగడ, కలహండి, కంధమాల్ జిల్లాలు భారీ వర్షాలకు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం చురుగ్గా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వ్యవస్థ రానున్న రెండు మూడు రోజులపాటు పశ్చిమ-వాయువ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లే అవకాశం ఉంది.

Exit mobile version