NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : పూర్తి స్థాయి బడ్జెట్ మా ప్రభుత్వానికి ఇదే మొదటిది

Sridhar Babu

Sridhar Babu

పూర్తి స్థాయి బడ్జెట్ మా ప్రభుత్వానికి ఇదే మొదటిది అని శాసన సభ వ్యవహారాల ఇంచార్జీ శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మొదటి సారి ఎన్నికైన ఎంఎల్ఏ లు కూడా చర్చలో పాల్గొన్నారని, రైతులకు లక్షన్నర రుణమాఫీ ఇక్కడి నుండే అమలు చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు స్వాగతిస్తూ సభ లో సిఎం ప్రకటన చేశారని, యువత కి ప్రైవేటు రంగంలో నైపుణ్యం పెంచడానికి స్కిల్ యూనివర్సిటీ బిల్లు కు ఆమోదం చేసుకున్నామన్నారు. అదే రోజు..విశ్వవిద్యాలయం కి శంకుస్థాపన చేశారు సీఎం అని ఆయన తెలిపారు. జాబ్ క్యాలెండర్ పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. శాసనసభ ప్రత్యక్ష ప్రసారాల్లోని దృశ్యాలను మార్ఫింగ్ చేసి సహచర మంత్రి సీతక్క గౌరవానికి భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు విజ్ణప్తి చేశారు. శాసనసభ గౌరవం దిగజార్చే ఎలాంటి చర్యలు సహించబోమని తేల్చిచెప్పారు.

 
CM Revanth Reddy : ఖచ్చితంగా మూసీకి డీపీఆర్‌ ఉంటుంది.. త్వరలోనే మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్‌లను నియమిస్తాం
 

తెలంగాణ హైకోర్టు నిర్మాణం : శాసనసభలో తెలంగాణ సివిల్ కోర్టుల సవరణ బిల్లు 2024పై పలువురు సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు. హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్‌లో 1,000 కోట్ల రూపాయలు కేటాయించిందని గుర్తు చేసారు. రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఉన్నత న్యాయస్థాన భవనాలు తెలంగాణ రాష్ట్రం గర్వపడేలా ఉంటాయని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భూమిని హైకోర్టు నిర్మాణానికి తీసుకోవడం వల్ల పరిశోధనలకు ఎలాంటి ఆటంకం కలగదని స్పష్టం చేశారు. వ్యవసాయ పరిశోధనల కోసం మరో చోట రెట్టింపు భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే.. ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా వేశారు స్పీకర్‌. 9 రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో 5 బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 65 గంటల 30 నిమిషాల పాటు సభ జరిగింది.

Tragedy: బైక్‌పై విద్యుత్ తీగలు పడి భార్యాభర్తలు సజీవ దహనం..
 

Show comments