NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : 33 కోర్సులను ప్రక్షాళన చేసి విద్యార్థులకు అందిస్తాం

D Sridhar Babu

D Sridhar Babu

Duddilla Sridhar Babu : గత ప్రభుత్వం పదేళ్లలో 40 వేల ఉద్యోగాలివ్వలేదని విమర్శించారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 50 వేల పై చిలుకు ఉద్యోగాలుచ్చామని ఆయన తెలిపారు. గ్రూప్ 1 పరీక్షకు ముందు విద్యార్థులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ పరీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆయన మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో టెక్నికల్ వ్యవస్థలు మూలనపడ్డాయని, ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం పై ప్రత్యేకమైన శ్రద్దగా పెట్టిందని, పాలమూరులో రెండు ఏటీసీ ( అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్స్) ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పాలమూరులో స్కిల్ యూనివర్సిటీ విభాగం ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్యాలు అందిస్తామని, గత ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీలను నియమించలేదని మండిపడ్డారు.

Top 10 Smallest Creatures: ప్రపంచంలోనే టాప్ 10 చిన్న జీవులు..

యూనివర్సిటీలో ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా పరిశ్రమలు అనుసంధానం చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, టాటా టెక్నాలజీస్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. 33 కోర్సులను ప్రక్షాళన చేసి విద్యార్థులకు అందిస్తామని, బీఏ, బీకాం చదివే విద్యార్థులకు బ్యాంకింగ్ , పైనాన్షియల్ కోర్సులను జోడించి నైపుణ్యం కల్పిస్తామన్నారు. విద్యార్థుల పరిశోధనలకు తోడ్పాటు నందిస్తామని ఆయన వెల్లడించారు. పారిశ్రామీకరణకు విద్యను అనుసంధానం చేస్తామని, విద్యార్థుల భవిష్యత్తుకు మాది బాధ్యత.. పాలమూరు జిల్లా సీఎం జిల్లా. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు.

Vizag Honey Trap Case: హనీట్రాప్ కేసు.. కీలక ఆధారాలు స్వాధీనం