NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : పెట్టుబడిదారులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu : పరిశ్రమలు, ఐటీ కంపెనీలు హైదరాబాద్ కే పరిమితము కాకుండా టైర్ 2, 3 నగరాలకు విస్తరించాలని ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 4500 కోట్లు 2016 నుంచి ఐటి పరిశ్రమలకు ప్రభుత్వ సబ్సిడీల బకాయిలు పెండింగులో ఉన్నాయి. ఒక్కొక్కటిగా ప్రభుత్వం చెల్లిస్తూ వస్తుందని, ఏ ఉద్దేశ్యంతో పరిశ్రమలకు ప్రభుత్వం భూములు కేటాయించారో ఆ విధంగా పరిశ్రమలు సహేతుకమైన కారణం లేకుండా స్థాపించకపోతే భూముల పై టీఎస్ ఐఐసీ నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూముల అన్యాక్రాంతం పై కమిటీ నివేదిక వచ్చినాక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పరిశ్రమలకు, ఐటీకి సంబంధించి పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

Bangladesh : మెహర్ అఫ్రోజ్ తర్వాత బంగ్లాదేశ్ లో అదుపులోకి మరో నటి

రెండు అమెరికన్ బేస్డ్ కంపెనీలు.. 9 దేశాల్లో కార్యాలయాలు ఉంటే హైదరాబాద్ లో కార్యాలయం ఏర్పాటు చేశారని, ఈ సంవత్సరం 500 మందికి, రెండేళ్ళలో 2 వేల మందికి ఉపాది కల్పిస్తామని చెప్పారన్నారు. డ్రోన్స్ కు సంబంధించిన సాఫ్ట్ వేర్ వ్యవహారాలు ఈ కంపెనీలు చూస్తాయని, కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో కంపెనీ ఏర్పాటు చేశారన్నారు. పెట్టుబడిదారులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ విస్తరిస్తామని, గ్రామాల్లో ఉన్న టాలెంట్ ను ఉపయోగించుకుని వారికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఉన్నామన్నారు.

అనంతరం సెంటిలియన్ కంపెనీ సీఈఓ వెంకట్ మాట్లాడుతూ.. కరీంనగర్ లో మేము కంపెనీ ఏర్పాటు చేసామని, ఫ్లైట్ ట్రాకింగ్ 3డిలో రిక్రియేట్ విధానాన్ని రూపొందిసున్నామన్నారు. కరీంనగర్, హైదరాబాద్ లలో ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నామని, రాబోయే మూడేళ్ళలో 2 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. డైరెక్టర్ రాదకిషోర్ మాట్లాడుతూ.. తెలంగాణకు ఈరెండు కంపెనీలు తలమానికమన్నారు. మాకు ప్రభుత్వ మద్దతు బాగుందని, 500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాం… కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

Komatireddy Venkat Reddy: అతని విషయంలో మాట్లాడేంత టైమ్ లేదు.. మాట్లాడం వేస్ట్