NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం కాంగ్రెస్ సభలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అధికారం ఇచ్చి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు చెందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ ల పథకాలకు రూపకల్పన చేసిందని, రాష్ర్టంలోని ప్రధాన పరిశ్రమలు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ అభివృద్ధికోసం ఉద్యోగ, ఉపాధి అవకాశల కోసం ఏర్పాటు చేసినవేనని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Ranveer Singh: రెండు ఇళ్ళు అమ్మేసిన రణ్‌వీర్ సింగ్.. ఎన్ని కోట్ల లాభమో తెలుసా?

బీఆర్ఎస్, బీజేపి వాళ్లకు కళ్ళు కనపడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. సింగరేణి ప్రవేటికరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని శ్రీధర్‌ బాబు వెల్లడించారు. సింగరేణిలో ఇళ్ళ స్థలాలకు దాదాపు 20వేల మందికి పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది మాత్రమేనని, రామగుండంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడం కోసం ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు శ్రీధర్‌ బాబు. తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ,సోనియా గాంధీ అని.. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణా ప్రజలు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేదవారికి అందడం లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ స్కీములను పేదవారికి అందించి న్యాయం చేస్తామన్నారు.

Also Read : Revanth Reddy : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాం