NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : అభివృద్ధి కోసం మా పార్టీలోకి వస్తాం అంటే ఆహ్వానిస్తాం

D Sridhar Babu

D Sridhar Babu

పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ స్వయంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తినని క్లారిటీ ఇచ్చారని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంని కలిశానని అరికేపూడి అన్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత అంశం కోర్టు పరిధిలో ఉంది దాని మీద స్పందించమని ఆయన వ్యాఖ్యానించారు. నాలుగు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హతకి ప్రక్రియ మొదలు పెట్టమంది.. నిర్ణయం తీసుకోమని చెప్పలేదన్నారు. అభివృద్ధి కోసం మా పార్టీ లోకి వస్తాం అంటే ఆహ్వానిస్తామని, న్యాయస్థానాలు చట్ట సభలకు డైరెక్షన్ ఇవ్వొచ్చా అనే దాని మీద చర్చ జరుగుతుందన్నారు. కాల పరిమితితో నిర్ణయం తీసుకోవాలనీ 10 వ షెడ్యూల్ లో ఎక్కడా లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Haryana Polls: పోటీ నుంచి తప్పుకున్న బీజేపీ అభ్యర్థి.. కారణమిదే..!

సభాపతి నిబంధనల ప్రకారమే ప్రతి పక్ష ఎమ్మెల్యేను పీఏసీ ఛైర్మన్ చేశారని ఆయన తెలిపారు. ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీయే అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు మా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆయన మండిపడ్డారు. సంఖ్యా బలం ప్రకారం ముగ్గురు ప్రతి పక్ష ఎమ్మెల్యేలకు పీ ఏ సీ చేర్చే అవకాశం ఉంది రూల్ బుక్ చెప్తోందని, ఎనిమిది నెలల్లో బీ ఆర్ ఎస్ లో మాట్లాడింది…హరీష్ రావు కేటీఆర్‌ మాత్రమే అనిఆయన అన్నారు. తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతుంది, ప్రజలు కోరుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు.

Bangladesh: “జమ్మూ కాశ్మీర్ విడిపోవాలి, మమతా బెనర్జీ స్వాతంత్య్రం ప్రకటించుకోవాలి”.. బంగ్లా ఉగ్రనేత వార్నింగ్..