కరీంనగర్ జిల్లాలోని అన్నారం బ్యారేజీని మంత్రుల బృందం సందర్శింది. బ్యారేజీకి బుంగలు పడ్డ చోటును మంత్రులు పరిశీలించారు. అన్నారం బ్యారేజీకి బుంగలు పడి ఇసుక బయటకు వస్తున్న ప్రాంతాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. ప్రాజెక్టు లో లోపాలన్ని మానవ తప్పిదాలే… లోపాలపై నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా Ntvతో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అన్నారం బ్యారేజీలో డిజైన్ లోపాలున్నాయన్నారు. ఒక సమీక్ష నిర్వహించాము… వారు నివేదిక ఇచ్చాక చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. మేము పరిశీలించిన తర్వాత కాంట్రాక్టర్ లోపాలు, విధాన పర లోపాలున్నాయని ఆయన తెలిపారు.
కాళేశ్వరం పబ్లిక్ హియరింగ్ సమయంలో చెప్పాము అలా అంటే మాపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. పంప్ హౌస్ లు మునిగినప్పుడు నేను mla గా వెళ్తే నాకు అనుమతి ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఈరోజు అందరికీ చూసే అవకాశం కల్పించాము.. మా పాలనకి పారదర్శకత కి నిదర్శనం ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పై మా పార్టీ విధానం ఒకటే.. ప్రాణహిత చేవెళ్ల ని 35 వేల కోట్లతో నిర్మించాలి అనేది మా విధానం అన్నారు. కానీ ప్రాజెక్టు కట్టే పనిలో ఉండగా ప్రభుత్వం మారిందన్నారు. మా ప్లాన్ మార్చేసి.. ప్రాజెక్టు లొకేషన్ బీఆర్ఎస్ మార్చిందని అన్నారు. పదేళ్ళలో ఏం జరిగిందో అందరికి తెలుసునన్నారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లకు ఖర్చు పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రారంభం నుంచి మాకు అనుమానాలు ఉన్నాయన్నాయన్నారు.
