NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : 2017లో వచ్చిన జీవో ఇప్పుడు అమలు చేస్తున్నాం

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

మూసీ నది ప్రక్షాళన ప్రజలకి స్వచ్ఛమైన గాలి నీరు అందించాలని అని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగా నదికి సంబంధించిన కూడా ప్రక్షాళన జరిగినప్పుడు బఫర్ జోన్,ftl ఇవ్వటం జరిగింది ఎందుకంటే వరదలు వచ్చినపుడు ఎలాంటి నష్టం జరగకూడదు అని ఆయన తెలిపారు. 2017 వచ్చిన go ఇప్పుడు అమలు చేస్తున్నామని, NGO లతో కలిసి మేము మీటింగ్ నిర్వహించామని ఆయన తెలిపారు. హుస్సేన్ సాగర్ పూర్తిగా వాసన వస్తుందని, గతంలో టెండర్ పిలిచారు కానీ పనులు జరుగలేదన్నారు. 15000 ఎకరాల్లో ఫార్మా సిటీ వస్తుందని ఆయన అన్నారు. జహీరాబాద్‌లో కాలుష్యం లేని హ్యుందాయ్ కంపెనీ వస్తుందని, ఏ ఫ్యాక్టరీ రావొద్దు యువతకి ఉపాధి కల్పించవద్దు అని వారి ఆలోచన.. కచ్చితంగా మేము యువతకి ఉపాధి కల్పిస్తాము…. తరువాత ఎన్నికలకు పోతామని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. పీసీసీ అధ్యక్షుడు కొండా సురేఖ అంశంపై వివరణ ఇచ్చారు అంతటితో అంశం ఐపోయిందని, నేను 5000 రూపాయలు ఇస్తాము అని నేను మాట్లాడలేదు … వ్యక్తిగతంగా నేను ఎప్పుడు మాట్లాడలేదన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు. స్కిల్ యూనివర్శిటీ సంబంధించిన అడ్మిషన్స్ అక్టోబర్ జరిగే అవకాశం ఉంది.. యూనివర్సిటీ కి సంబంధించిన బాధ్యతలు మొత్తం కూడా ఆనంద్ మహేంద్రా చూసుకుంటారన్నారు.

ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి టీమిండియా ఫాస్ట్ బౌలర్..

Show comments