Site icon NTV Telugu

Duddilla Sridhar Babu : సిట్టింగ్ జడ్జిని కాళేశ్వరం విచారణకు ఇవ్వాలని హైకోర్టును కోరినం

Sridhar Babu

Sridhar Babu

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి సంబంధించి అసెంబ్లీలో శ్వేతపత్రం సమర్పించింది. శనివారం ఉదయం సభ ప్రారంభం కాగానే నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. మంత్రి తన ప్రసంగంలో మేడిగడ్డ ప్రాజెక్టుపై ఆందోళనలను ఎత్తిచూపారు. ప్రాజెక్టుల పరిస్థితిని వివరించే సంక్షిప్త వీడియోను అసెంబ్లీలో పంచుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు సంబంధించి నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీతో చర్చలు కొనసాగుతున్నాయని, ఎన్‌డీఎస్‌ఏ నివేదికను సభకు సమర్పించారని మంత్రి ఉత్తమ్‌ ఉద్ఘాటించారు. ప్రాజెక్ట్ అనంతర తనిఖీలు లేకపోవడాన్ని మంత్రి ఉత్తమ్ ఎత్తి చూపారు , కాగ్ నివేదిక ఆధారంగా జవాబుదారీ చర్యలను అమలు చేస్తామని ఉద్ఘాటించారు.

అయితే ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిట్టింగ్ జడ్జిని కాళేశ్వరం విచారణకు ఇవ్వాలని హైకోర్టు ను కోరామని ఆయన వెల్లడించారు. జడ్జి లు తక్కువ ఉన్నారు అని హైకోర్టు నుంచి రిప్లై వచ్చిందని, మళ్ళీ లేఖ రాస్తామని ఆయన పేర్కొన్నారు. మా మ్యానిఫెస్టోలో జ్యూడిషియల్ విచారణ అని స్పష్టం చేసామని, సీబీఐ విచారణ కేంద్రం చేస్తా అంటే మేము వద్దు అన్నామని ఆయన పేర్కొన్నారు. సీబీఐ ఒకటే కాదు వాళ్ళు చేయాలనుకుంటే ED, CVC ఉందని, వాటితో విచారణ చేస్తే బీఅరెస్, బీజేపీ ఒకటవువతారు అన్న అనుమానం మాకు ఉందన్నారు. కాగ్ నివేదిక మీద కూడా విచారణ జరిపిస్తామని, గతంలో సిట్టింగ్ జడ్జి చేత పలు విచారణలు జరిగాయి, సిట్టింగ్ జడ్జి ని ఎపుడు ఇవ్వలేదు అన్న వాదనలు అవాస్తవమన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే కాళేశ్వరం మీద విచారణ జరిపించే వాళ్ళు …సిట్టింగ్ జడ్జి ని ఇచ్చే వాళ్ళు విచారణకు అని ఆయన అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ నిర్వహించారు. రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ఫెయిల్యూర్ స్కీమ్ అని, గ్రౌండ్‌లో సర్వే చేయకుండా వేల కోట్లు ఖర్చు పెట్టి స్కీమ్ స్టార్ట్ చేశారన్నారు. ఊర్లలో మిషన్ భగీరథ నీళ్లు రాక పోవడం, అవి క్లీన్ గా లేకపోవడంతో పబ్లిక్ మినరల్ వాటర్ తాగుతున్నారని, మిషన్ భగీరథ ఓపెనింగ్ పైలాన్ నా నియోజకవర్గంలో చౌటప్పల్‌లో హరీష్ ఓపెన్ చేశారన్నారు. 3 రోజుల కు ఒక సారి చౌటప్పల్ లో నీళ్లు వస్తున్నాయి అవి క్లీన్ గా ఉండటం లేదని, మునుగోడు, దేవరకొండ కు సాగు నీరు ఇవ్వాలని సీఎం కి వినతి పత్రం ఇస్తామన్నారు. డిండి ప్రాజెక్టు కోసం ఎదుల రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుక రావడం కోసం ప్లాన్ రెడీ చేసామని, మునుగోడు, దేవరకొండ లో 3.60 లక్షల ఎకరాల కు నీళ్లు వస్తాయని ఆయన అన్నారు.

Exit mobile version