మా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో డిసెంబర్ 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వ నిర్ణయాలు క్లారిటీగా చెప్పారని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా, మూసీ లాంటి కార్యక్రమాల గురించి చెప్పారని, పేద,మధ్యతరగతి కుటుంబ అవసరాలు తెలుస్కొని అవి తీర్చడానికే మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మాది పేద ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని, మూసీ నది ప్రక్షాళన పై బిఆర్ఎస్ పార్టీ వారు ఆరోపణలు చేస్తున్నారని, బీఆర్ఎస్ హయంలోనే మూసీ రివర్ డెవలప్మెంట్ 2017 లో జీవో నెంబర్ 90 ద్వారా కార్పొరేషన్ ఏర్పాటు చేసారన్నారు శ్రీధర్ బాబు. అక్రమ కట్టడాలు లెక్క తీయాలని,రివర్ బెడ్ బఫర్ జోన్ ఫిక్స్ చేయాలని అందులో పేర్కొన్నారని, అప్పటి మీటింగ్ మినిట్స్ లో చాలా స్పష్టంగా ఉన్నది. అక్రమ కట్టడాలు ఎలా తొలగించాలి అని ఆయన వెల్లడించారు.
UP: యూపీలో ఘోరం.. ఫీజు కట్టలేదని విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్
అంతేకాకుండా..’2020 జూన్ 27 న అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ మీటింగ్ ఏర్పాటు చేసి..బఫర్ జోన్,మూసీ మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సుమారు 15వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. బఫర్,ఎఫ్టీఎల్ నిర్దారణ చేసి అక్రమ కట్టడాలు కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జీవో నెంబర్MS 7 ద్వారా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ గా గుర్తించాలని 2016 లోనే చెప్పారు. మూసీ ఒడ్డున చదర్ఘాట్ ప్రాంతంలో వర్షంతో ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. మూసీ మాక్సిమం ఫ్లడ్ లెవల్ 1లక్ష 50వేలు క్యూసెక్కులు..ఇరిగేషన్ ఇంజనీర్ వాళ్ళు చెప్పినవి. బీఆర్ఎస్ ఆలోచన చేస్తే మంచి కార్యక్రమం..మేము చేస్తే మంచి కార్యక్రమం కాదా..? హైదరాబాద్ విశ్వనగరం పేరుకే కాదు..అట్లా ఉండాలని ముందుకు వెళ్తే బిఆర్ఎస్ బురద జల్లుతుంది. మీరు చేస్తే ఒప్పు..మేము చేస్తే తప్పు అవుతుందా..? మీరు మంచి సూచనలు,సలహాలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తుంది. కానీ బిఆర్ఎస్ దీన్ని రాజకీయం చేస్తూ సమస్యను జఠిలం చేస్తున్నారు. కాళేశ్వరం,మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో అప్పుడు ఎందుకు మీరు మానవత్వం చూపెట్టలేదు.’ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
Ponguru Narayana: త్వరలో ఏపీ వ్యాప్తంగా కూల్చివేతలు.. స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని హెచ్చరిక