సచివాలయంలో తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబుతో బుధవారం కాన్సుల్ జనరల్ ఆఫ్ ఫ్రాన్స్ కన్సులేట్ జనరల్ బెంగళూరు, థేయిరి బెర్తెలోట్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఏ సందర్బంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనువైన వాతావరణం తదితర అంశాలను మంత్రి ఫ్రాన్స్ కాన్సూల్ జెనరల్ బెర్తేలోట్ కు వివరించారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోతున్నా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ విశేషాలను పంచుకున్నారు. క్లస్టర్ల వారీగా ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఐఐటీ లు, ఐఐఐ లు, ఐ ఎస్ బి లాంటివి హైదరాబాద్ లో ఉన్నాయని, 165 ఇంజనీరింగ్ కాలేజి లు ఉన్నాయని, ప్రపంచ వ్యాప్తంగా ది బెస్ట్ మ్యాన్ పవర్ ఇచ్చే రాష్ట్రమగా తెలంగాణ ఉండబోతోందని మంత్రి వివరించారు.
హైదరాబాద్ లో ని టి హబ్ లో ఏర్పాటు కానున్న ఫ్రాన్స్ కాన్సులేట్ హైదరాబాద్ కార్యాలయం త్వరలో ప్రారంభించనున్నట్టు కాన్సల్ జనరల్ బెంగళూరు థేయిరి బెర్తెలోట్ మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్ ఇండియా అంబాసిడర్ రానున్నట్టు తెలిపిన ఆయన మంత్రి శ్రీధర్ బాబు ను ఆహ్వానించారు. కార్యక్రమంలో ఐటి, ఇండస్ట్రీస్ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఉన్నారు.
మంత్రి తో టెలి పెర్ఫార్మన్స్ కంపెనీ ప్రతినిధుల భేటీ
ఫ్రాన్స్ కి చెందిన ప్రముఖ సంస్థ టెలి పెర్ఫార్మన్స్ ప్రతినిధులు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తో భేటీ బుధవారం సచివాలయం లో భేటీ అయ్యారు. ఆ సంస్థ ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఐటీసీ కోహినూర్ లో నిర్వహిస్తున్న ఇమ్మెన్సీవ్ ఈవెంట్ కు అతిధిగా రావాలని ఆహ్వానించారు. దేశ వ్యాప్తంగా తమ సంస్థలో 90 వేల మంది ఉద్యోగులు, ప్రపంచ వ్యాప్తంగా 95 దేశాల్లో 5 లక్షల మంది కి పైగా ఉద్యోగులు 300 పైగా భాషల్లో పనిచేస్తున్నారని మంత్రికి తెలిపారీ. త్వరలోనే హైదరాబాద్ తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలుగా ఉన్న పలు జిల్లా కేంద్రాల్లోనూ తాము తమ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి గా ఉన్నామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మమతా లంబ మంత్రి కి వివరించారు. టెలి పెర్ఫార్మన్స్ సంస్థ పెట్టుబడులకు, సంస్థ కార్యకలాపాకు ప్రభుత్వం తరుపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సమావేశంలో ఐటి, ఇండస్ట్రీస్ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో పటు కంపెనీ ప్రతినిధులు శివ ఊలపల్లి, ఫనిందర్ నల్లబెల్లి, స్వాతి పాల్గొన్నారు.
