NTV Telugu Site icon

Srinivasa Murthy Passed Away: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత

Srinivasa Murthy P

Srinivasa Murthy P

Srinivasa Murthy Passed Away: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.. టాలీవుడ్‌, బాలీవుడ్‌ సహా.. ఇతర సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అలనాటి సత్యభామ, సీనియర్‌ నటి జమున కన్నుమూసిన విషయం జీర్ణించుకోలేకపోతున్న సమయంలోనే మరోవైపు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు.. ఇవాళ ఉదయం 8.30 గంటలకు చెన్నైలో ఆయన ప్రాణాలు విడిచారు.. సూర్య, అజిత్, విక్రమ్, మోహన్ లాల్, రాజశేఖర్ వంటి అనేక మంది ప్రముఖ దక్షిణ భారత నటులకు తన గాత్రాన్ని అందించిన డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి.. తన కుటుంబంతో కలిసి చెన్నైలో నివసిస్తున్నాడు.. అయితే, ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆయన మరణించాడు.

Read Also: Actor Naresh: నరకయాతన అనుభవిస్తున్నా.. విడాకులు ఇప్పించండి..

శ్రీనివాస్ మూర్తి తన శక్తివంతమైన మరియు బహుముఖ స్వరంతో ప్రసిద్ధి చెందాడు.. నటులు పోషించిన పాత్రలకు తన గాత్రంతో బలాన్ని జోడించారు.. అయితే, సినిమా పరిశ్రమలో ముఖ్యమైన భాగం అయినప్పటికీ, డబ్బింగ్ ఆర్టిస్టులు తెరవెనుక పని చేయడం వల్ల తరచుగా గుర్తించబడరు. ఇక, శ్రీనివాస మూర్తి స్వరం సూర్య పాత్రలతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంది, అతని సినిమాల్లో చూసినప్పుడు మరొక నటుడి వాయిస్ వినడానికి మొదట్లో ఇబ్బందిగా ఉంటుంది. అతను చాలా మంది ఇతర నటులకు కూడా డబ్బింగ్ చెప్పారు.. తెలుగు డబ్బింగ్ రాజుగా వెలిగారు.. శ్రీనివాస మూర్తి వెయ్యికి పైగా సినిమాలు.. హాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాలను దక్షిణాది ప్రాంతీయ భాషల్లోకి, ముఖ్యంగా తెలుగులోకి అనువదించబడిన సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు.. షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్‌లకు కూడా తన గాత్రాన్ని అందించాడు. అతని కృషి, అంకితభావంతో తెలుగు చలనచిత్రం శివయ్యకు డబ్బింగ్‌ చెప్పగా.. 1998లో ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుతో సహా పలు అవార్డులతో గుర్తింపు పొందరు..