NTV Telugu Site icon

Bus Accident: అదుపు తప్పిన బస్సు.. పోలీస్ కానిస్టేబుల్‌తో సహా మరో వ్యక్తి మృతి

Bus Accident

Bus Accident

Bus Accident: ఓ అదుపుతప్పిన డీటీసీ బస్సు ఢిల్లీ రింగ్‌ రోడ్డులోని మొనాస్టరీ మార్కెట్‌ సమీపంలోని సివిల్‌ లైన్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ను, మరో వ్యక్తిని గుద్ది చంపేసింది. బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాధితులు చనిపోయారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘాజీపూర్‌కు చెందిన డిటిసి బస్సు డ్రైవర్ వినోద్ కుమార్ (57)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నమన్నారు. బస్సు పరిస్థితి బాగాలేకపోవడంతో బస్సులో డీటీసీ డీఓ తప్ప ప్రయాణికులెవరూ లేరు.

Read Also: Happy Birthday Virat kohli: నేడు 36 పుట్టినరోజును జరుపుకుంటున్న రికార్డ్‭ల రారాజు విరాట్ కోహ్లీ

ఢిల్లీ పోలీసుల ప్రకారం, రింగ్ రోడ్‌లోని మొనాస్టరీ మార్కెట్ వెలుపల సంఘటన స్థలంలో పోలీసు బృందం దర్యాప్తు చేయగా.. బస్సు పరిస్థితి అసలేమీ బాగాలేదని, బస్సులో డిటిసి డిఓ తప్ప ప్రయాణికులెవరూ లేరని గుర్తించారు. ఇంతకు ముందు కూడా, అక్టోబర్ 28 న, వికాస్పురి ప్రాంతంలో హైస్పీడ్ డీటీసీ ఎలక్ట్రిక్ బస్సు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుకు పైగా వాహనాలు ధ్వంసం కాగా, ఒక పాదచారికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బస్సును సీజ్ చేశారు.

Show comments