Site icon NTV Telugu

సివిల్ సప్లై శాఖపై ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం: డీఎస్ చౌహాన్

Ds Chouhan

Ds Chouhan

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సజావుగా జరుగుతుంది అని సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు జరిగినప్పుడు చిన్న చిన్న లోపాలు జరుగుతాయి.. ధాన్యం కొనుగోలు దాదాపు పూర్తి కావొస్తోంది.. రైతులకు ధాన్యం కొన్న తర్వాత డబ్బులు పడ్డాయా లేదా అనేది ప్రతీ సెంటర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం.. 7, 172 సెంటర్లలో 39.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాము.. తెలంగాణ రైస్ కు మంచి బ్రాండ్ ఏర్పడింది.. అందుకే మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. కాగా, ఇప్పటి వరకు 83 శాతం 6.66 లక్షల డబ్బులు విడుదల చేశాము..ఒక కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణలో ఇప్పటి వరకు రాలేదు.. రెండు సీజన్లు కలిపి కోటి దాటుతుంది.. అధికారులు ఫీల్డ్ లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకున్నాం.. ప్రస్తుతం సివిల్ సప్లై లోన్ 52276.78 ఉన్నది.. ఒక్క క్వాటర్ 6346 కోట్ల లోన్ ను తగ్గించామని డీఎస్ చౌహాన్ వెల్లడించారు.

Read Also: Raghunandan Rao: కాంగ్రెస్ ప్రభుత్వం సందిగ్ధంలో ఉంది..

ఇక, ధాన్యం తరుగు అనేది అవాస్తవం.. కొనుగోలు కేంద్రాల వద్ద క్లీనింగ్ మిషన్లు పెట్టామని సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ తెలిపారు. క్లీనింగ్ ఉన్న ధాన్యంలో ఒక్క కిలో కూడా కట్టింగ్ లేదు.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే ధాన్యం క్లీన్ గా ఉండాలని ఆదేశాలు ఉన్నాయి.. ధాన్యంలో మట్టి, చిన్న రాళ్ళు, వరి డస్ట్ ఉంటే సమస్య వస్తుంది.. బకాయిలు ఉన్న మిల్లర్లకు ధాన్యం ఇవ్వలేదు.. కొంత మంది మిల్లర్ల వద్ద కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది.. అందుకే వాళ్లకు ధాన్యం ఇవ్వలేదు.. 668 కోట్ల డిపాల్టర్ నుంచి నిధులను రికవరీ చేశాము.. పాడి అలాట్మెంట్ అనేది సైంటిఫిక్ మెథడ్ ద్వారా జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. నితీ నిజాయితిగా మేము పనులు చేస్తున్నాం.. ఎవరైనా మిల్లర్లు డబ్బులు ఇచ్చినట్లు నిరూపించాలి.. మాపై అసత్య ఆరోపణలు చేయడం వల్ల మాకే కాదు రైతులకు ఇబ్బంది అవుతుంది.. ఎవరైనా అధికారులు డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలి అని డీఎస్ చౌహాన్ డిమాండ్ చేశారు.

Read Also: Etela Rajender: 6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కాగా, గత ఏడాది జూలై వరకు కొనుగోళ్లు, పేమెంట్ జరిగింది అని డీఎస్ చౌహాన్ చెప్పుకొచ్చారు. ధాన్యం కొనుగోలు MSP రేటు కంటే ఎక్కువగా అత్యాల్పంగ 2300 నుంచి 2800 వరకు వెళ్లింది.. తడిసిన, మొలకలు వచ్చిన ధాన్యం కూడా మేము కొంటాం.. రైతులకు నష్టం జరగకుండా MSP ధర ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. ఆధారాలు లేని అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నాతో మాట్లాడారు కొన్ని ఏరియాల్లో డ్రై ఉంది అని చెప్పాం.. ఇక, బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి ఆరోపణలను సివిల్ సప్లై కమిషనర్ తీవ్రంగా ఖండించారు. నిరాధారమైన ఆధారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తే అధికారుల మావోధైర్యం దెబ్బతింటుంది.. నేనేంటో అందరికీ తెలుసు.. నేను 25 ఏళ్లుగా అధికారిగా ఉన్నాను.. మా డిపార్ట్మెంట్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది.. 43 క్రిమినల్ కేసు పెట్టాం.. సివిల్ సప్లై శాఖపై ఆధారాల్లేకుండా ఎవరు ఆరోపణలు చేసినా మేం చూస్తూ ఊరుకోం అని సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.

Exit mobile version