Drunk Youth Attack Police: తాగుబోతుల వీరంగం.. పోలీసులపై దాడి.. పరారీలో యువకులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drunk Youth Attack Police: ఈ మధ్య తాగుబోతులు, మత్తుపదార్థాలు సేవించే వారి దారుణాలు మితి మీరుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలో అర్ధరాత్రి తాగుబోతుల అల్లరి పెద్ద హంగామా సృష్టించింది. పట్టణంలోని తాళ్లచెరువు ప్రాంతంలో యువకులు మద్యం సేవిస్తూ అల్లరి చేస్తుండగా.. అక్కడి స్థానికులు డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే బ్లూ కోర్ట్ సిబ్బంది కానిస్టేబుల్ గంగాధర్, హోంగార్డ్ జహీర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ మద్యం మత్తులో ఉన్న యువకులను వారు మందలించే ప్రయత్నం చేశారు.
Rave Party: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ.. యువతులతో అశ్లీల నృత్యాలు, 26 మంది అరెస్ట్!
Also Read
అయితే అక్కడ మద్యం తాగిన యువకులు అతి దూకుడు ప్రదర్శించి కానిస్టేబుల్ గంగాధర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో అడ్డుకున్న హోంగార్డ్ జహీర్‌పై దుండగులు దాడి చేసి అక్కడి నుండి పరారయ్యారు. జహీర్‌కు గాయాలు కావడంతో సహచరులు అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దాడి చేసిన యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనతో పట్టణంలో ఒకింత ఉద్రిక్తత నెలకొంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!