Site icon NTV Telugu

Drunk Youth Attack Police: తాగుబోతుల వీరంగం.. పోలీసులపై దాడి.. పరారీలో యువకులు!

Drunk Youth Attack Police

Drunk Youth Attack Police

Drunk Youth Attack Police: ఈ మధ్య తాగుబోతులు, మత్తుపదార్థాలు సేవించే వారి దారుణాలు మితి మీరుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలో అర్ధరాత్రి తాగుబోతుల అల్లరి పెద్ద హంగామా సృష్టించింది. పట్టణంలోని తాళ్లచెరువు ప్రాంతంలో యువకులు మద్యం సేవిస్తూ అల్లరి చేస్తుండగా.. అక్కడి స్థానికులు డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే బ్లూ కోర్ట్ సిబ్బంది కానిస్టేబుల్ గంగాధర్, హోంగార్డ్ జహీర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ మద్యం మత్తులో ఉన్న యువకులను వారు మందలించే ప్రయత్నం చేశారు.

Rave Party: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ.. యువతులతో అశ్లీల నృత్యాలు, 26 మంది అరెస్ట్!

అయితే అక్కడ మద్యం తాగిన యువకులు అతి దూకుడు ప్రదర్శించి కానిస్టేబుల్ గంగాధర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో అడ్డుకున్న హోంగార్డ్ జహీర్‌పై దుండగులు దాడి చేసి అక్కడి నుండి పరారయ్యారు. జహీర్‌కు గాయాలు కావడంతో సహచరులు అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దాడి చేసిన యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనతో పట్టణంలో ఒకింత ఉద్రిక్తత నెలకొంది.

క్లాసిక్ లుక్, మోడ్రన్ ఫీచర్లతో భారత మార్కెట్లోకి వచ్చేస్తున్న Indian Scout బైకులు.. లాంచ్కు ముహూర్తం ఫిక్స్!

Exit mobile version