Site icon NTV Telugu

Drunk And Drive: పట్టుబడిన మందుబాబులకు కిక్కిచ్చే శిక్ష

Drunk And Drive

Drunk And Drive

Drunk And Drive: డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారి పట్ల పోలీసులు ఇటీవల కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట నిలబెడుతున్నారు. న్యాయస్థానాలు కూడా మందుబాబులను ఉపేక్షించడం లేదు. వారికి బుద్ధి వచ్చేలా తీర్పులు ఇస్తున్నాయి. మంచిర్యాల పట్టణ పరిధిలో ఇటీవల పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్ నిర్వహించగా 13 మంది మందుబాబులు పట్టుబడ్డారు. వారిని మంచిర్యాల ఫస్ట్‌ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరపర్చగా.. జడ్జి డి.ఉపనిషద్‌ వాణి వారికి శిక్ష విధించారు.

Drug Gang Busted : నార్కోటిక్ డ్రగ్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు

13 మంది మందు బాబులకు రెండు రోజులు ఆస్పత్రిని క్లీన్ చేయాలని శిక్ష విధించారు. శిక్షను ఉల్లంఘించిన వారికి పదిరోజుల సాధారణ జైలు శిక్ష విధించబడుతుందని ఆదేశించారు. 13 మందు బాబులు రెండు రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు హెల్త్ సెంటర్ నందు శుభ్రత నిమిత్తం పని చేయవలసిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ.. వాహనదారులు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తమ వాహనాన్ని నడపాలని , మద్యం సేవించి ఎవరూ వాహనాలను నడుపరాదని, శిక్షలు మరింత కఠినంగా ఉంటాయని తెలిపారు.

Exit mobile version