Moringa Millet Khichdi Recipe: చలికాలంలో వేడివేడిగా మునగాకు మిల్లెట్ కిచిడీ.. రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moringa Millet Khichdi Recipe: చలికాలంలో వేడివేడిగా, రుచిగా కిచిడీ తినడంలో ఒక ప్రత్యేకమైన మజా ఉంటుంది. ఈ సీజన్లో తేలికగా, టేస్టీగా, పోషకాహారంగా ఏదైనా తినాలనుకుంటే మునగాకు మిల్లెట్ కిచిడీ తప్పక ట్రై చేయొచ్చు. దీన్ని కొర్రలు (ఫాక్స్‌టైల్ మిల్లెట్), పెసరపప్పు, సీజనల్ కూరగాయలు, మునగాకులతో తయారు చేస్తారు. దీని రుచి ఎంత బాగుంటుందంటే కిచిడీ పెద్దగా ఇష్టం లేనివాళ్లు కూడా మళ్లీమళ్లీ తినాలని కోరుకుంటారు. దీన్ని చేయడం కూడా చాలా సింపుల్, పెద్దగా టైమ్ గానీ, కష్టం గానీ పట్టదు. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలో వేడివేడిగా సర్వ్ చేయొచ్చు. మునగాకు మిల్లెట్ కిచిడీకి ఏమేం కావాలి, ఇంట్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
Also Read
- Bajra Raab Recipe: చలికాలంలో వేడివేడిగా సజ్జ రాబ్ తాగారా? రాజస్థానీ స్టైల్లో ఇలా చేసేయండి!
- Bengali Aloo Posto Recipe: ఆలూ కూర తిని విసుగొచ్చిందా? బెంగాలీ స్టైల్లో ఆలూ పోస్తో ట్రై చేయండి.. రుచి అదిరిపోతుంది!
- Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
- Tomato Paratha Recipe: కాస్త పులుపు.. కాస్త కారంగా.. టమాటర్ పరాటా ఇలా చేసేయండి..
కొర్రలు (ఫాక్స్‌టైల్ మిల్లెట్): 80 గ్రాములు – 1/2 కప్పు
పచ్చ పెసరపప్పు / పసుపు పెసరపప్పు: 50 గ్రాములు – 1/4 కప్పు
మునగాకు: 1 కప్పు (తరిగింది)
కలిపిన కూరగాయలు: 1 కప్పు (క్యారెట్, బీన్స్, బఠాణీ మరియు సొరకాయ)
అల్లం: 1 టీస్పూన్ (తురుముకున్నది)
పసుపు: 1/4 టీస్పూన్
జీలకర్ర: 1/2 టీస్పూన్
ఇంగువ: 1 చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
నెయ్యి: 1 టీస్పూన్
కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగింది)
నీళ్లు: 2.5 కప్పులు
మునగాకు మిల్లెట్ కిచిడీ తయారీ విధానం..
మునగాకు మిల్లెట్ కిచిడీ చేయడానికి ముందుగా కొర్రలు, పెసరపప్పును నీళ్లతో శుభ్రంగా కడగాలి. తర్వాత రెండింటినీ విడివిడిగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఇంగువ వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత అల్లం వేసి కాస్త వేయించాలి. తర్వాత తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, బఠాణీ, సొరకాయ ముక్కలు వేయాలి. కూరగాయలను సుమారు 2 నిమిషాల పాటు తేలికగా వేయించాలి. ఇప్పుడు కుక్కర్లో కొర్రలు, పెసరపప్పు, మునగాకు, పసుపు, ఉప్పు వేయాలి. అందులో 2.5 కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. అన్నింటినీ చక్కగా కలిపిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు కిచిడీని ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ప్రెషర్ దానంతట అదే తగ్గే వరకు వదిలేయాలి. తర్వాత కుక్కర్ మూత తీసి కిచిడీని నెమ్మదిగా కలపాలి. పైన తరిగిన కొత్తిమీర చల్లి గార్నిష్ చేయాలి. అంతే, వేడివేడి మునగాకు మిల్లెట్ కిచిడీ రెడీ. దీన్ని పెరుగు, పచ్చడి లేదా అప్పడంతో సర్వ్ చేయొచ్చు. చలికాలంలో లంచ్ లేదా డిన్నర్‌కు ఇది మంచి హెల్దీ, టేస్టీ ఆప్షన్.
తాజావార్తలు
-
Moringa Millet Khichdi Recipe: చలికాలంలో వేడివేడిగా మునగాకు మిల్లెట్ కిచిడీ.. రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం..
-
Bihar Train Scare: రైలులో మంటలు అంటూ పుకార్లు.. భయంతో ఎమర్జెన్సీ గేట్ నుంచి దూకిన ప్రయాణికులు.. వీడియో వైరల్!
-
Ravichandran Ashwin: సిరాజ్ విషయంలో గంభీర్ నిర్ణయం కరెక్టే.. అశ్విన్ సంచలన పోస్ట్..
-
Boyapati Srinu: నా ఊరంటే నాకు ఇష్టం.. మన ఓటే మన ఆయుధం!
-
Mahesh Babu Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ.. అసలు కారణం అదేనా.?
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!