NTV Telugu Site icon

Hyderabad: ఐకియా వాహనంలో గంజాయి సరఫరా.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఇస్తున్న డ్రైవర్లు

Ganja

Ganja

Drugs were seized at many places in Hyderabad: ఐకియా అంటే ఫర్నీచర్‌ అమ్మకాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌. హైదరాబాద్‌ ఐకియా కంపెనీలో కొనుగోలు చేసిన ఫర్నీచర్‌ ఐటమ్‌ను వ్యాన్లలో సరఫరా చేసి.. తిరుగు ప్రయాణంలో గచ్చిబౌలి ప్రాంతంలో పనిచేసే ఐటీ ఉద్యోగులతో సంబంధాలు పెట్టుకొని వారికి గంజాయి సరఫరా చేస్తూ అదనపు ఆదాయం సంపాందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. వారిని ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెలికాం నగర్‌, గచ్చిబౌలి ప్రాంతంలోని జీహెచ్‌ఎంసీ పార్కు ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఐకియా సరుకులు రవాణ చేసే వ్యాన్‌లో తనిఖీలు నిర్వహించగా 1.12 కేజీల గంజాయి పట్టుబడింది. ఐకియా వాహనాల డ్రైవర్లు గచ్చిబౌలి ప్రాంతంలోని ఉన్న వ్యక్తులకు గంజాయి తీసుకు వచ్చి ఇస్తుంటారు. కాగా.. గంజాయి అక్రమ రవాణదారులు ఫర్నీచర్‌ రవాణ చేసే వ్యాన్‌ డ్రైవర్లను వినియోగించుకున్నారు. గంజాయి సరఫరా చేసిన మహేష్‌, సిద్ధు అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ నాగర్‌ కర్నూల్‌కు చెందిన వారిగా గుర్తించారు. గంజాయిని పట్టుకున్న వారిలో ఎస్సై జ్యోతి, హెడ్‌కానిస్టేబుల్‌ అలీమ్‌.. కానిస్టేబుళ్లు లేఖ సింగ్‌, కార్తీక్‌, రాంచందర్‌లు ఉన్నారు. కాగా.. గంజాయిని పట్టుకున్న ఎస్ టి ఎఫ్ టీమ్‌ను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ భాస్కర్‌, డీఎస్పీ తిరుపతి యాదవ్‌ అభినందించారు.

Read Also: CM Chandrababu: రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం.. 48 గంటల్లోనే డబ్బులు..!

మరోవైపు.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బెంగళూరు నుండి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకుని.. నిందితులను అరెస్టు చేశారు. మరొక చోట భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు.. ముంబై నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 320 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వసీంను అరెస్టు చేసి డ్రగ్స్ స్వాధీన పరుచుకున్నారు టీఎస్ న్యాబ్. కాగా.. ముంబైకి చెందిన ఆర్యన్ పరారీలో ఉన్నట్లు టీఎస్ న్యాబ్ తెలిపింది. గత కొంత కాలం నుంచి బస్సులో డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాదులో విక్రయిస్తున్నాడు వసీం. డ్రగ్స్‌కు అలవాటు పడి డబ్బుల కోసం విక్రయాలు చేస్తున్నాడు వసీం.

Read Also: Game Changer: ఎంతైనా రామ్ చరణ్ నిజమైన ‘గేమ్ చేంజర్’ అబ్బా!