హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమవుతుంది. ఈ క్రమంలో మరోసారి డ్రగ్స్ మహమ్మారి వెలుగు చూసింది. న్యూ ఇయర్ టార్గెట్ గా విచ్చల విడిగా డ్రగ్స్ సరఫరా అవుతోంది. ఈ క్రమంలో న్యూ ఇయర్ వేడుకల కోసం క్రాక్ అరేనా అనే పబ్ డ్రగ్స్ పార్టీ అరెంజ్ చేసింది. గచ్చిబౌలి పరిధిలోని ఓ ఈవెంట్‌లో డీజే పార్టీలో డ్రగ్స్ లభించింది. పార్టీకి వచ్చిన 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. గచ్చిబౌలిలోని క్రాక్ అరేనా పబ్‌లో బెమ్ బూమర్ షో సందర్భంగా నిన్న వీరంతా అటెండ్ అయ్యారు. తనిఖీల్లో ఎనిమిది మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. నిందితులను గచ్చిబౌలి పోలీసులకు టీజీ న్యాబ్ పోలీసులు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Pawan Kalyan: చిరంజీవి ముసుగు కట్టుకొని సినిమా థియేటర్ కి వెళ్ళేవాడు!
బెమ్ బూమర్ ప్రముఖ జర్మన్ డీజే ప్లేయర్.. ఇతని షోలు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా.. ఈనెల 27న కోల్‌కతా, 28న ఢిల్లీలో షోలు జరిగాయి. ఆదివారం (29న) హైదరాబాద్‌లో ఈవెంట్ జరిగింది. ఈరోజు గోవాలో నిర్వహిస్తున్నారు. జనవరి 4న బాలిలో బెమ్ బూమర్ షోలు జరుగనున్నాయి