Drugs : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ గా డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. 41.4 కోట్ల విలువ చేసే 5.92 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. సౌత్ ఆఫ్రికా లేడి కిలాడి హ్యాండ్ బ్యాగ్‌లో హెరాయిన్ గుర్తించిన కస్టమ్స్ అధికారులు.. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాంబీయా నుండి హైదరాబాద్ వచ్చిన సౌత్ ఆఫ్రికా జాతీయురాలి వద్ద డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. హ్యాండ్ బ్యాగేజ్‌లో దాచిన హెరాయిన్ గుట్టును రట్టు చేశారు కస్టమ్స్ అధికారులు. తెల్లటి పౌడర్ కలిగిన హెరాయిన్ ను హ్యాండ్ బ్యాగ్ తో పాటు ఫైల్ ఫోల్డర్ లో దాచి తరలించే ప్రయత్నం చేసింది ఆమె. అయితే.. ప్రయాణికురాలి ఫ్రోఫైల్ ఆధారంగా సౌత్ ఆఫ్రికా లేడి కిలాడిని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. తన వెంట తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ ను క్షుణ్ణంగా పరిశీలించిన కస్టమ్స్ బృందం. బ్యాగ్ లోపలి భాగంలో హెరాయిన్ దాచినట్లు గుర్తించారు.
ఇదిలా ఉంటే.. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎయిర్‌పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వెనెజులా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ. కోట్లు విలువ చేసే కొకైన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందన్న ముందస్తు సమాచారం మేరకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వెనెజులా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద భారీగా కొకైన్ బయటపడింది. అతడి బ్యాగ్‌లో 628 గ్రాముల 57 కొకైన్ క్యాప్సూల్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుపడిన కొకైన్ విలువ రూ.6.2 కోట్ల మేర ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- Kharif Water Release: ఖరీఫ్‌కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
తాజావార్తలు
-
James Hopes: “గెలిచే మ్యాచ్‌లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
-
Rashmika : విజయ్ దేవరకొండ కోసం కాదు..ఒక అబ్బాయి కారణంగా ఆ పని చేశా..
-
Bharat Gaurav: నేపాల్‌కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
-
Kharif Water Release: ఖరీఫ్‌కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..