శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ గా డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. 41.4 కోట్ల విలువ చేసే 5.92 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. సౌత్ ఆఫ్రికా లేడి కిలాడి హ్యాండ్ బ్యాగ్‌లో హెరాయిన్ గుర్తించిన కస్టమ్స్ అధికారులు.. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాంబీయా నుండి హైదరాబాద్ వచ్చిన సౌత్ ఆఫ్రికా జాతీయురాలి వద్ద డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. హ్యాండ్ బ్యాగేజ్‌లో దాచిన హెరాయిన్ గుట్టును రట్టు చేశారు కస్టమ్స్ అధికారులు. తెల్లటి పౌడర్ కలిగిన హెరాయిన్ ను హ్యాండ్ బ్యాగ్ తో పాటు ఫైల్ ఫోల్డర్ లో దాచి తరలించే ప్రయత్నం చేసింది ఆమె. అయితే.. ప్రయాణికురాలి ఫ్రోఫైల్ ఆధారంగా సౌత్ ఆఫ్రికా లేడి కిలాడిని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. తన వెంట తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ ను క్షుణ్ణంగా పరిశీలించిన కస్టమ్స్ బృందం. బ్యాగ్ లోపలి భాగంలో హెరాయిన్ దాచినట్లు గుర్తించారు.
ఇదిలా ఉంటే.. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎయిర్‌పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వెనెజులా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ. కోట్లు విలువ చేసే కొకైన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందన్న ముందస్తు సమాచారం మేరకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వెనెజులా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద భారీగా కొకైన్ బయటపడింది. అతడి బ్యాగ్‌లో 628 గ్రాముల 57 కొకైన్ క్యాప్సూల్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుపడిన కొకైన్ విలువ రూ.6.2 కోట్ల మేర ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
