NTV Telugu Site icon

Praneeth Hanumantu: యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతుపై డ్రగ్స్‌ కేసు!

Praneeth Hanumantu Drugs

Praneeth Hanumantu Drugs

Drugs Case on Youtuber Praneeth Hanumantu: గంజాయి మత్తులో తండ్రి-కూతురు బంధంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌, సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్‌ హనుమంతుపై మరో కేసు నమోదైంది. తండ్రీకుమార్తెల బంధంపై చీప్ కామెంట్స్ చేసిన ప్రణీత్‌ను సైబర్‌ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడిపై పోలీసులు డ్రగ్స్‌ కేసు నమోదు చేశారు. మాదకద్రవ్యాలు, గంజాయి సేవించినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రణీత్‌ హనుమంతుపై 67బీ, ఐటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు 79, 294 బీఎన్‌ఎస్‌, ఎన్డీపీఎస్‌ చట్టాల కింద పలు సెక్షన్లు జత చేశారు. ప్రస్తుతం ప్రణీత్‌ చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. పోలీసులు అతడిని మూడు రోజుల పాటు కస్టడీకి కోరుతూ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్ న్యాయవాదికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

Also Read: Virat Kohli-BCCI: ఎలాంటి అపోహలు వద్దు.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ భరోసా!

డార్క్ కామెడీ పేరుతో సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేసిన ప్రణీత్‌పై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వచ్చాయి. హద్దు దాటానని క్షమాపణలు కోరుతూ ఓ వీడియోను వదిలాడు. గత కొన్ని రోజులుగా తన తల్లిదండ్రులను చాలామంది బూతులు తిడుతున్నారని, వారిని దయచేసి వారిని ఏమనొద్దని, తప్పంతా తనదే అని ప్రణీత్ పేర్కొన్నాడు. చట్టానికి గౌరవిస్తూ ముందుకు సాగుతానని, మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయనని చెప్పుకొచ్చాడు. అయినా కూడా అతడిని శిక్షించాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు గంజాయి వ్యవహారం కూడా బయట పడడంతో కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

 

Show comments