Site icon NTV Telugu

Hyderabad: రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం..

Drugs In Gachhibowli

Drugs In Gachhibowli

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వద్ద 15 గ్రాముల డ్రగ్స్ ను మాదాపూర్ ఎస్ఓటీ టీమ్ సీజ్ చేశారు. కారులో డ్రగ్స్ తరలిస్తుండగా మాటు వేసి పట్టుకున్నారు ఎస్ఓటీ అధికారులు. ఆ తర్వాత నిందితుడు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎస్ఓటీ బృందం.. నిందితుడు పాత నేరస్థుడుగా గుర్తించారు. దీంతో.. అతనిపై (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. నిందితుడు రాజేంద్రనగర్ సన్ సిటీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జయ్ చంద్గా గుర్తించారు.

Harish Rao: రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ..

కర్ణాటకలోని బెంగుళూరుకు చెందిన ప్రధాన నిందితుడు సోహాన్ అలియాస్ శ్రీధర్ పరారీలో ఉన్నాడు. అయితే.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జయ్ చంద్ బెంగుళూరులో కొన్ని రోజులుగా MDMA డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడు. సప్లయర్ సోహాన్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నాడు. 20 గ్రాముల MDMA డ్రగ్ కొనుగోలు చేసి 5 గ్రాముల డ్రగ్ విద్యార్థులకు అమ్మాడు ఈ కేటుగాడు. వివేక్ అనే డ్రగ్ పెడలర్ ద్వారా MDMA కొనుగోలు చేసినట్లు జయ్ చంద్ పోలీసుల‌‌ ఎదుట ఒప్పుకున్నాడు.

Supreme court: యూపీ మదర్సా చట్టం కేసులో కీలక తీర్పు

ఈ క్రమంలో.. ప్రధాన నిందితుడు సోహాన్ తో పాటు వివేక్ అనే డ్రగ్ పెడలర్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కర్ణాటకలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జయ్ చంద్ MDMA డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఎస్ఓటీ టీమ్ కు సమాచారం అందింది. దీంతో.. జయ్ చంద్ కదలికలపై మాదాపూర్ ఎస్ఓటీ బృందం నిఘా పెట్టింది. ప్రధాన నిందితుడు సోహెన్ ఆదేశాల మేరకు వివేక్ ద్వారా డ్రగ్ సప్లై చేస్తున్నట్లు తెలుసుకున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో డ్రగ్ దందాకు తెరలేపాడు కేటుగాడు.

Exit mobile version