Drugs : డ్రగ్స్ కు అడ్డగా పబ్బులు.. ఎన్ని సార్లు రైడ్లు చేసినా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి? అని ఎవరైనా అడిగితే పబ్స్‌లో దొరుకుతాయని ఈజీగా సమాధానం చెప్పవచ్చు. అంతలా డ్రగ్స్ దందా అక్కడ నడుస్తోంది. ఏకంగా కొంత మంది డీజేలే పెడ్లర్ల అవతారం ఎత్తి వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా పబ్బులు.హైదరాబాద్‌లో పబ్బులు.. డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.. పబ్బుల తీరు మారడం లేదనే విమర్శలు. ఒక్కసారి రెండుసార్లు కాదు.. పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా.. డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. అంతే కాదు డ్రగ్స్ వినియోగంలో పబ్బుల తీరు మారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.. .హైదరాబాద్ పబ్బులలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని మీడియా ఎప్పటి నుంచో చెబుతోంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ మాదక ద్రవ్యాల సప్లై మాత్రం ఆగడం లేదు…డ్రగ్స్ సప్లై చేస్తున్న డీజేలు.
ముఖ్యంగా పబ్‌లలో డ్రగ్స్‌ను.. అక్కడ పని చేసే డిస్క్ జాకీలు లేదా డీజేలు సప్లై చేస్తున్నారనే విషయం బయటపడింది. పెద్ద పెద్ద పబ్బులలో పనిచేస్తున్న డీజేలు తమ సైడు బిజినెస్‌గా డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాదులో పోలీసులు ఆకస్మికంగా పబ్బుల పైన సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా డ్రగ్స్ గురించి సమాచారం అందిన తర్వాత గచ్చిబౌలి, మాదాపూర్‌లోని రెండు పబ్‌లపై దాడి చేశారు. పోలీసులు ఆన్-సైట్ డ్రగ్ పరీక్షలు నిర్వహించగా… నలుగురు యువకులకు పాజిటివ్‌గా తేలింది. పోలీసులకు దొరికిన వారంతా కూడా డీజేలే ఉన్నారు. నిబంధనలను ఉల్లంఘించి పనిచేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని క్లబ్ రోగ్, ఫ్రాట్ హౌస్ పబ్‌లలో ఈ తనిఖీలు చేశారు పోలీసులు…
Also Read
పబ్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకునే అవకాశం . ఈ దాడుల్లో పోలీసులు అనేక మంది కస్టమర్లు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. స్థానికంగా నిర్వహించిన మాదకద్రవ్య పరీక్షల్లో నలుగురు వ్యక్తులు గంజాయి సేవించినట్లు నిర్ధారించారు. వారిని మాదాపూర్ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. తమ ప్రాంగణంలో డ్రగ్ సంబంధిత కార్యకలాపాలను అనుమతించినందుకు పబ్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు… ఈ సంఘటన తర్వాత, మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నివారించడానికి, చట్టపరమైన నిబంధనలను పాటించేలా చూడటానికి హైదరాబాద్ అంతటా నైట్ లైఫ్ సంస్థల పర్యవేక్షణను పెంచాలని పోలీసులు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!