Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Drug Riot In Hyderabad 5 Persons Arrested In Birthday Party

Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బర్త్‌డే పార్టీలో మత్తులో జోగిన యువకులు

Published Date :April 10, 2024 , 7:38 am
By Mahesh Jakki
Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బర్త్‌డే పార్టీలో మత్తులో జోగిన యువకులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Drugs: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను పట్టి పీడిస్తున్న భూతాల్లో ‘డ్రగ్స్’ ఒకటి. ముఖ్యంగా.. యువతీ యువకులు ఈ డ్రగ్స్‌కు బానిసలై, తమ ఉజ్వల భవిష్యత్తుని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇది చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ.. దుండగులు అడ్డదారుల్లో ఈ డ్రగ్స్‌ని సరఫరా చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్‌ను రాజేంద్రనగర్‌ ఎస్వోటీ టీమ్‌ సీజ్ చేసింది. 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ ప్లేవర్స్ డ్రగ్స్‌ను ఎస్వోటీ స్వాధీనం చేసుకుంది. పుట్టిన రోజు పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తుండగా ఎస్వోటీ అధికారులు 5 మంది యువకులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బర్త్‌డే పార్టీలో ఆ యువకులు మత్తులో జోగినట్లు తెలిసింది. ఆ యువకులు గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వద్ద నుండి ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయి, ఓసీబీ ప్లేవర్స్ డ్రగ్స్ తో పాటు 5 మొబైల్స్‌ను పోలీసులు సీజ్ చేశారు.

Read Also: Road Accident: గోతిలో పడిన బస్సు.. 15 మంది మృతి!

గంజాయి పట్టివేత
రంగారెడ్డి జిల్లాలోని దుండిగల్‌లో గంజాయి పట్టుబడింది. 1.35 కేజీల గంజాయి మేడ్చల్ ఎస్ఓటీ బృందం సీజ్ చేసింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తెచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. గంజాయి విక్రయిస్తుండగా వల పన్ని ఎస్ఓటీ బృందం పట్టుకుంది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో కేటుగాళ్లు గంజాయి దందాకు తెరలేపినట్లు తెలిసింది.

విలాసాలతో ప్రారంభమై.. మాదకద్రవ్యాల ఉచ్చులో పడుతోంది నేటి యువత. నగరంలోనే కాదు.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో యువత మత్తు వలయంలో చిక్కుకుంటోంది. సరదాగా సిగరెట్లు, మద్యంతో మొదలై.. క్రమంగా ఆ అలవాటు మాదకద్రవ్యాల సేవనం వరకు ఇది దారితీస్తోంది. గంజాయి విక్రయాలు నగరం నలుమూలలా జరుగుతుండటం వల్ల యువతపై డ్రగ్స్​ ప్రభావం అధికంగా ఉంటోంది. పరిస్థితి విషమించే వరకు చాలామంది తల్లిదండ్రులు గుర్తించకపోవడం వల్ల పలు కుటుంబాల వేదన వర్ణనాతీతంగా ఉంటోంది. తల్లిదండ్రులు పిల్లలను కాస్తా కనిపెడుతూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Birthday Party
  • Drug Riot
  • Drugs
  • hyderabad
  • telangana

తాజావార్తలు

  • Varanasi: క్లైమాక్స్‌కు చేరువలో ‘వారణాసి’..హైదరాబాద్ శివార్లలో షూటింగ్

  • Iran War: యూఏఈపై 450 క్షిపణి, 2,000 డ్రోన్ దాడులు.. అయినా యూఏఈ ఇరాన్‌తో ఎందుకు పోరాడటం లేదు..?

  • Tamil Nadu Elections: తమిళనాడులో గెలిచేదెవరు.? తాజా సర్వేలో సంచలన ఫలితాలు..

  • Viral News: ‘పోలీస్ మామల స్క్వాడ్’.. మందుబాబుల వాట్సాప్ గ్రూప్‌లో షాకిచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ

  • Botsa Satyanarayana: అమరావతిపై తీర్మానం చేసినంత మాత్రాన పర్మినెంట్‌ కాదు.. బొత్స సంచలనం

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions