Site icon NTV Telugu

Drug Rocket: మహిళల హైహీల్స్‌లో డ్రగ్స్.. భారీగా డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేసిన ఈగల్ టీం..!

Drug Rocket

Drug Rocket

Drug Rocket: తెలంగాణ నార్కోటిక్ డ్రగ్స్ టీంకు కొత్త పేరు పెట్టిన తర్వాత అతిపెద్ద డ్రగ్ రాకెట్ ను గుట్టు రట్టు చేసింది ఈగల్ టీం. ఈగల్ టీం నేతృత్వంలో అతిపెద్ద నెట్వర్క్ బట్టబయలు అయ్యింది. కొంపల్లి లోని మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య ఈ డ్రగ్ రాకెట్ ని నడుపుతున్నట్లు తేలింది. అంతేకాకుండా హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలోని కొన్ని ప్రముఖ పబ్ యజమానుల పాత్ర కూడా ఉన్నట్లు బట్టబయలైంది.

Read Also:Jakkampudi Raja: జనసేనలో చేరికపై క్లారిటీ ఇచ్చిన జక్కంపూడి.. చిరంజీవి అంటే మా కుటుంబానికి అభిమానం..!

ప్రతిరోజు పబ్బులలో డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీలు జరుగుతున్నట్లు అధికారులు తేల్చారు. ఇందుకు సంబంధించి పది పబ్బుల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు అధికారులు. మూడు పబ్బు యజమానులతో డైరెక్ట్ గా కాంట్రాక్టు పెట్టుకుని అక్కడ డ్రగ్ పార్టీలను నిర్వహించినట్లు అధికారులు తేల్చారు. దీనికి తోడు హైదరాబాదుకు అతి సమీపంలో ఉన్న రిసార్ట్ లలో కూడా ఈ డ్రగ్ పార్టీలను ఏర్పాటు చేశారని అధికారుల విచారణలో బయటపడింది. అయితే ఏకంగా 23 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ డ్రగ్ సంబంధించిన విషయంలో పాలు పంచుకున్నట్టు విచారణలో తేలింది.

Read Also:Bandi Sanjay Kumar: నేను మీలాగే పేదరికం నుండి వచ్చిన వాడినే.. కేంద్రమంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

కొంపల్లి కేంద్రంగా నడుస్తున్న ఈ డ్రగ్ పార్టీలో ఆరుగురిని అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన ఇద్దరు నైజీరియన్ల ధర ఈ డ్రగ్ ను హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. మహిళల హైహీల్స్ లో డ్రగ్ ను పెట్టి నేరుగా సూర్యకి పంపిస్తున్నారు. కొరియర్ అందుకున్న సూర్య నేరుగా ఈ డ్రగ్స్ తీసుకెళ్లి పబ్బులలో పార్టీలను ఏర్పాటు చేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ కి 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిసార్ట్స్ లో కూడా పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ సమీపంలో ఉన్న రిసార్ట్లో ఎంగేజ్ చేసుకుని ఈ డ్రగ్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది.

Exit mobile version