Site icon NTV Telugu

Tirupati: తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు కలకలం..

Drugs

Drugs

తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు కలకలం సృష్టిస్తున్నాయి. స్థానిక ఇంద్ర ప్రియదర్శిని కూరగాయలు మార్కెట్లో మత్తు ఎక్కించే ఇంజక్షన్లు వీడియో వైరల్ అవుతోంది. ఇంజక్షన్ లను తీసుకునే సమయంలో యువకులు వీడియో తీశారు. కూరగాయల మార్కెట్ లో తరచూ మత్తులో ఉంటూ యువకులు హల్ చల్ సృష్టిస్తున్నారు. తిరుపతి నగరంలో విచ్చలవిడిగా మత్తు పదార్థాల వినియోగం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. యువత స్వయంగా మత్తు ఇంజక్షన్లు వేసుకుంటున్నారని వెల్లడిస్తున్నారు.

READ MORE: Bengaluru Stampede: తొక్కిసలాట ఆర్సీబీ ఫ్యాన్ ఫిర్యాదు.. యాజమాన్యంపై మరో కేసు..!

చిన్న వయసులోనే కొంతమంది చిన్నారులు సిగరెట్లు, గంజాయి మత్తు, మద్యానికి బానిసలవుతున్నారు. యువత హాష్‌ ఆయిల్, మత్తు ఇంజక్షన్లు, డ్రగ్స్‌ అలవాటుపడుతున్నారు. ఇలాంటి వారిని మత్తుకు దూరంగా ఉంచే ప్రయత్నంలో కొంతమంది తీవ్ర ఆవేశానికి గురవుతున్నారు. అంతర్లీనంగా ఏర్పడిన మానసిక పరిస్థితులతో తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నారు. తాజాగా తిరుపతిలో ఈ ఘటన బయటపడింది. ప్రస్తుతం యువత ప్రవర్తనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version