తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు కలకలం సృష్టిస్తున్నాయి. స్థానిక ఇంద్ర ప్రియదర్శిని కూరగాయలు మార్కెట్లో మత్తు ఎక్కించే ఇంజక్షన్లు వీడియో వైరల్ అవుతోంది. ఇంజక్షన్ లను తీసుకునే సమయంలో యువకులు వీడియో తీశారు. కూరగాయల మార్కెట్ లో తరచూ మత్తులో ఉంటూ యువకులు హల్ చల్ సృష్టిస్తున్నారు. తిరుపతి నగరంలో విచ్చలవిడిగా మత్తు పదార్థాల వినియోగం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. యువత స్వయంగా మత్తు ఇంజక్షన్లు వేసుకుంటున్నారని వెల్లడిస్తున్నారు.