Site icon NTV Telugu

Amritpal Singh : త్వరలోనే వస్తా.. అమృత్‌పాల్‌ సింగ్‌ మరో వీడియో

Amrithpal Singh

Amrithpal Singh

గత 13 రోజులుగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే ఛీప్ అమృత్ పాల్ సింగ్ మరో వీడియోను విడుదల చేశాడు. తానేమీ పరారీలో లేనని, త్వరలోనే మీ ముందుకు వస్తానని ఆయన తెలిపాడు. యూట్యూబ్ లో ప్రసారమైన వీడియోలో దర్శనమిచ్చిన అమృత్ పాల్ సింగ్ తాను ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోనని తెగేసీ చెప్పాడు. నేను తిరుగుబాటుదారుడిని.. అయినా పారిపోను.. త్వరలోనే ప్రపంచం ముందుకు వస్తా.. ప్రభుత్వానికి భయపడటం లేదు.. మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి అంటూ పేర్కొన్నాడు. తాను ప్రస్తుతం ఎంచుకున్న మార్గమంతా పూర్తిగా ముళ్లతో ఉందని.. అయినప్పటికీ దృడంగా నిలబడాలని ఆ వీడియోలో తన కుటుంబ సభ్యులను ఆయన కోరాడు.

Also Read : JP Nadda: ఏపీ-తెలంగాణలో నూతన బీజేపీ ఆఫీస్‌.. వర్చువల్ ద్వారా ప్రారంభించనున్న జేపీ నడ్డా

అయితే అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ రాష్ట్ర పోలీసులు వేట ముమ్మరం చేశారు. గురువారం డ్రోన్ కెమెరాతో రంగంలోకి దిగారు. హోషియార్ పూర్ జిల్లాలోని మర్నాయిన్ గ్రామంలో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రోన్ తో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం ఇదే గ్రామంలో కొందరు అనుమానితులు తమకారును వదిలేసి పారిపోయారు. వారిలో అమృత్ పాల్ సింగ్ ఉండవచ్చని పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, తాను ఎక్కడికీ పారిపోలేదు.. తొందరలోనే ప్రపంచం ముందుకు వస్తాను అంటూ అమృత్ పాల్ సింగ్ పేర్కొన్నాడు. చావంటూ నాకు భయం లేదు.. ఎవరికి నేను భయపడే ప్రసక్తి లేదు అంటూ అమృత్ పాల్ సింగ్ అన్నాడు.

Also Read : MLA vs MLC: పండుగపూట డీజేసౌండ్స్ తో మారుమోగిన తిరుమలగిరి.. పోటా పోటీగా బీజేపీ, కాంగ్రెస్

Exit mobile version