Site icon NTV Telugu

Drishyam 3 : ఆఖరి ఆట మొదలైంది.. ‘దృశ్యం 3’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Drushyam 3

Drushyam 3

క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఒక సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసిన ‘దృశ్యం’ సిరీస్‌ అంతా చూసే ఉంటారు. ఇప్పుడు ఈ సిరీస్ ముగింపు దశకు చేరుకుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, దర్శకుడు జీతు జోసెఫ్ తెరకెక్కించిన ‘దృశ్యం 3’ విడుదల తేదీ ఖరారైంది. మోహన్ లాల్ తన సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాను ఏప్రిల్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. విశేషమేమిటంటే, ఈ సిరీస్‌లో ఇదే చివరి భాగం కావడం.

Also Read : Lokesh Kanagaraj : లోకేష్ కనగరాజ్ ‘DC’ సర్ప్రైజ్.. వాలెంటైన్స్ డే నాడు అదిరిపోయే అప్‌డేట్!

అయితే రెండవ భాగం చివర్లో జార్జికుట్టి పోలీసుల కన్నుగప్పి తన ఇంటి కింద శవాన్ని పాతిపెట్టి తప్పించుకుంటాడు. మరి మూడో భాగంలో పోలీసులు ఆ శవాన్ని వెలికితీస్తారా? లేదా జార్జికుట్టి మరో మాస్టర్ ప్లాన్‌తో అందరినీ బురిడీ కొట్టిస్తాడా? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ఇప్పటికే హిందీలో అజయ్ దేవగన్ ‘దృశ్యం 3’ షూటింగ్ మొదలవ్వగా, తెలుగులో వెంకటేష్ కూడా త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. అన్ని భాషల క్లైమాక్స్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేసేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఏప్రిల్ 2న థియేటర్లలో పడబోయే ఈ సినిమాతో జార్జికుట్టి కథకు ఒక పవర్‌ఫుల్ ముగింపు లభిస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version