తాజాగా జయశంకర్ భూపాలపల్లి ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర తాగుబోతుల సంఘం అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ పర్యటించారు. ఇది ఎన్నికల ప్రచారం కోసం కాదు. మద్యం దుకాణాలను ఆకస్మికంగా సందర్శించి రాష్ట్రంలో మద్యం స్టాక్ గురించి తెలుసుకోవడానికి అధ్యక్షుడు ఏం చేశారో చూడండి.
Also Read: RR vs DC: ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలని లక్ష్యంగా బరిలోకి రాజస్థాన్ రాయల్స్..
వేసవి కాలంలో చాలా చోట్ల బీరు కొరత ఏర్పడుతుంది. మరోవైపు వ్యాపారస్తులు సిండికేట్ గా వ్యవహరిస్తూ ధరలు పెంచి దోచేస్తున్నారు వైన్స్ వ్యాపారులు. ఈ నేపథ్యంలో మద్యం ప్రియుల ఫిర్యాదు మేరకు డ్రింకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తరుణ్ జయశంకర్ భూపాలపల్లి ప్రాంతంలో పర్యటించారు. కాటారం మండల కేంద్రంలోని శ్రీనివాస వైన్స్, తెలంగాణ వైన్స్ లు సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆయనకు తాగుబోతులు పెద్దఎత్తున్న పలకరించారు.
Also Read: Rohit Sharma: డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న హిట్ మ్యాన్.. అందుకేనా..
ఈ సందర్భంగా తాగుబోతుల సంఘం అధ్యక్షుడు తరుణ్ మాట్లాడుతూ.. ఇలాంటి వైన్స్ షాప్స్ యజమానులు చోరీ వల్ల తాగుబోతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రెండు షాప్స్ ను పక్కపక్కనే ఉంచడంతో బెల్ట్ షాప్‌లను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నిత్యం ఎక్సైజ్ అధికారులు ముడుపులు తీసుకున్నట్లు సమాచారం మా వద్ద ఉందన్నారు. విద్యాసంస్థలకు అతి సమీపంలో మద్యం దుకాణం నిర్వహిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తరుణ్ ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లైట్ బీర్ కొరతతో మద్యం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తూ డిమాండ్ మేరకు లైట్ బీర్ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. డ్రింకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తరుణ్‌కు ఘనస్వాగతం పలికిన మద్యం ప్రియులు ఆయనతో కలిసి బేర్స్ కావాలంటూ ధర్నాకు దిగారు. అన్ని మద్యం షాపుల్లో లైట్ బీర్ విక్రయించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడతామన్నారు.