NTV Telugu Site icon

Drinker Hulchul: తాగుబోతు హల్‌చల్.. పీకలదాకా తాగి బస్సుపై నిద్రించిన మందుబాబు

Drinker

Drinker

Drinker Hulchul: కడప జిల్లాలో ఓ తాగుబోతు హల్‌చల్ చేశాడు. వేంపల్లిలో ఓ తాగుబోతు పీకలదాకా తాగాడు. మద్యం మత్తులో రాయచోటి డిపోకు చెందిన రాయచోటి – వేంపల్లి పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు టాప్ పైకెక్కి నిద్రించాడు. ఇది గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ బస్సును వేంపల్లి నుంచి రాయచోటికి తీసుకు వెళ్లే క్రమంలో చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లికు బస్సు చేరుకుంది. ఈ క్రమంలో బస్సు టాప్ పైన నిద్రిస్తున్న మందుబాబును స్థానిక ప్రజలు గుర్తించారు. వెంటనే కేకలు వేసి డ్రైవర్లను అప్రమత్తం చేయడంతో త్రాగుబోతు ప్రాణాలతో బయటపడ్డాడు. బస్సును ఆపిన డ్రైవర్ తాగుబోతును నెమ్మదిగా కిందికి దించి అక్కడ వదిలేసి వెళ్లిపోయాడు. ఇది చూసిన స్థానిక ప్రజలు నవ్వుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also: Chandrababu: తెలుగుదేశం ఓ రాజకీయ వర్సిటీ.. నేటితరం నేతల మూలాలు టీడీపీలోనే..

Show comments