Maharastra: ఇక మహారాష్ట్రలోని ఆలయాల్లోకి ఎలా పడితే అలా వెళ్లాలంటే కుదరదు. నాగ్‌పూర్ జిల్లాలోని నాలుగు ఆలయాల్లో డ్రెస్ కోడ్ అమలులోకి వచ్చింది. శ్రీ గోపాలకృష్ణ దేవాలయం (ధంతోలి), శ్రీ సంకత్మోచన్ పంచముఖి హనుమాన్ దేవాలయం (బెల్లోరి-సవనేర్), శ్రీ బృహస్పతి దేవాలయం (కనోలిబార), శ్రీ హిల్‌టాప్ దుర్గామాత ఆలయం (మానవతనగర్)లలో టీ షర్ట్స్, జీన్స్, స్కర్టులు, అసభ్యకరమైన పొట్టి బట్టలు వేసుకుని రాకుడదని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ఈ డ్రెస్ కోడ్‌ను అమలు చేసే యోచనలో ఉన్నట్లు మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్ తెలిపింది.
Read Also:NITI Aayog : ప్రధాని మోడీ అధ్యక్షతన 8వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం
నాగ్‌పూర్ తర్వాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో డ్రెస్ కోడ్‌ను అమలు చేసేందుకు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, గురుద్వారాలు, చర్చిలు, మసీదులు, పాఠశాలలు-కళాశాలలు, కోర్టులు, పోలీసు స్టేషనల్లో కూడా డ్రస్ కోడ్ వర్తిస్తుందని మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్ కోఆర్డినేటర్ సునీల్ ఘన్‌వత్ తెలిపారు. దీని ఆధారంగా ఆలయాల పవిత్రత, మర్యాదలు, సంస్కృతి పరిరక్షించబడుతుందనీ, అందుకే ఆలయాల్లో అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
Read Also:Arvind Kejriwal : నేడు తెలంగాణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేసీఆర్‌తో జాతీయ రాజకీయాలపై చర్చ
నాగ్‌పూర్‌లోని శ్రీ గోపాలకృష్ణ దేవాలయంలో డ్రెస్‌కోడ్ బోర్డు పెట్టిన అనంతరం ఆలయ ధర్మకర్త ప్రసన్న పాటూర్కర్, ఆలయ కమిటీ అధినేత శ్రీమతి మమతాయ్ చించ్వాడ్కర్, అశుతోష్ గోటేలు విలేకరులతో మాట్లాడారు. ఆలయ పవిత్రతను కాపాడాలని, భారతీయ సంస్కృతిని పాటించాలన్నారు. అందుకోసం భక్తులు తమ శరీరాన్ని కనిపించేలా పొట్టి బట్టలు వేసుకుని ఆలయానికి రావద్దని, కేవలం సంప్రదాయ దుస్తుల్లోనే ఆలయంలోకి ప్రవేశించాలని కోరుతున్నామని తెలిపారు. భారతీయ సంస్కృతిని అనుసరించి ఆలయ నిర్వహణలో సహకరించాలని కోరారు. మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్ కోఆర్డినేటర్ సునీల్ ఘన్‌వత్ మాట్లాడుతూ.. ఆలయాల పవిత్రత, మర్యాదలు, సంస్కృతిని కాపాడేందుకు ఇక్కడ డ్రెస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు.
