Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంచలనం సృష్టించిన ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కోనేరు వద్ద శివలింగాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. తోటపేట గ్రామానికి చెందిన 38 సంవత్సరాల శీలం శ్రీనివాస్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడిని అరెస్టు వివరాలు కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. ఎస్పీ వివరాల ప్రకారం.. ఇంటివద్ద పంట కాలువ స్థలం విషయంలో ఆలయ పూజారితో నిందితుడికి వివాదం తలెత్తింది. ఆలయ పూజారి శివలింగానికి పూజ చెయ్యడం చూసి శివలింగాన్ని ధ్వంసం నిందితుడు ధ్వంస చేశాడు. కేసు పూజారి మీదకు వెళుతుందనే ప్రణాళికతో శివలింగాన్ని ధ్వంసం చేశాడు. నిన్న అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఘటన జరిగినట్లు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితుడు వేరే మతానికి చెందిన వాడని, అధికార పార్టీకి చెందినవాడని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఎస్పీ స్పష్టం చేశారు. నిందితుడు హిందూ మతానికి చెందిన వ్యక్తి అని వెల్లడించారు.
READ MORE: New Year Midnight Kiss: న్యూ ఇయర్ మిడ్‌నైట్ కిస్.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే?
