NTV Telugu Site icon

YSR Crop Insurance Scheme: డాక్టర్‌ వైఎస్సార్‌ పంటల బీమా పథకానికి జాతీయస్ధాయి గుర్తింపు

Ysr Crop

Ysr Crop

డాక్టర్‌ వైఎస్సార్‌ పంటల బీమా పథకానికి జాతీయస్ధాయి గుర్తింపు లభించింది. అవార్డు గెలుచుకోవడంపై వ్యవసాయ శాఖ అధికారులను అభినందించారు సీఎం వైఎస్‌ జగన్‌. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన పీఎంఎఫ్‌బీవై జాతీయ సదస్సులో ఇన్నోవేషన్‌ కేటగిరీలో ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌కు అందజేశారు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్‌ అహుజా. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి, భారత ప్రభుత్వం అందజేసిన జ్ఞాపికను చూపిన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్‌ సీఎంకి చూపించారు. ఈ సందర్భంగా అధికారులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత సమర్ధవంతంగా పనిచేయాలన్నారు.

Read Also: Upendra Kushwaha: 2024లోనూ ప్రధాని మోడీకి ఎదురు లేదు.. నితీష్ ప్రయత్నం వృధానే!

వ్యవసాయరంగంలో దిగుబడుల అంచనాలలో టెక్నాలజీ వినియోగం పెంచాలని దిశానిర్ధేశం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌. సాగుచేసిన ప్రతి ఎకరా పంట వివరాలను అత్యంత పారదర్శకంగా ఈ–క్రాప్‌ ద్వారా నమోదు చేయడం, తద్వారా ఉచిత పంటల బీమా పథకాన్ని కేవలం ఈ–క్రాప్‌ నమోదు ఆధారంగా అమలుచేయడం ద్వారా యూనివర్శల్‌ కవరేజిని సాధించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సాధించింది.

Read Also: Puvvada Ajay Kumar : కేసీఆర్‌ని సాదుకుంటారో సంపుకుంటారో మీ ఇష్టం

Show comments