Site icon NTV Telugu

Thomas Isaac: రూ. 9.6 లక్షల విలువైన 20 వేల పుస్తకాలు తప్ప మరే ఆస్తి లేదు..

Thomas

Thomas

ఎన్నికల నేపథ్యంలో కేరళ మాజీ ఆర్ధిక శాఖ మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన LDF నేత, పతనంతిట్ట అభ్యర్థి డా. థామస్ ఐజాక్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. అప్పుడప్పుడు అమెరికా పర్యటనలు, డిజైనర్‌ కుర్తాలంటే ఇష్టపడే ఆయన సాధారణ జీవనశైలితో తోటి నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్‌ నేతగా పేరొందిన థామస్‌ ఐజాక్‌ ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించారు. ఐజాక్‌ పేరిట 9.6 లక్షల రూపాయల విలువ చేసే 20 వేల పుస్తకాలు తప్ప మరే ఆస్తి లేదని ఎన్నికల సంఘానికి తెలిపారు.

Read Also: New Tax Regime Calculator: కొత్త ఆదాయపు పన్ను విధానం.. తప్పుడు సమాచారంపై కేంద్రం క్లారిటీ!

అయితే, బ్యాంక్‌ సేవింగ్స్‌లో 6 వేల రూపాయలు సహా వివిధ బ్యాంక్‌ అకౌంట్లలో 1.31 లక్షల రూపాయల డిపాజిట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో థామస్ ఐజాక్ వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేత అయినప్పటికీ ఐజాక్ తిరువనంతపురంలో తన సోదరుడి ఇంట్లో రెంట్ కి నివాసం ఉంటున్నారు. అలాగే, పెన్షనర్ల ట్రెజరీ ఖాతాలో 68 వేల రూపాయలు, ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాలో 39 వేల రూపాయలు, కేఎస్‌ఎఫ్‌ఈ సుగమా ఖాతాలో 36 వేల రూపాయలు ఉన్నాయి. అంతే కాకుండా, అతను కేఎస్‌ఎఫ్‌ఈలో చిట్ ఫండ్‌ను వివిధ వాయిదాలలో మొత్తంగా 77 వేల రూపాయలు చెల్లించారు. అదనంగా, మలయాళం కమ్యూనికేషన్స్‌లో 10 వేల రూపాయల విలువ చేసే షేర్‌లు మాత్రమే థామస్ ఐజాక్ పేరు ఉండటం గమనార్హం.

Exit mobile version