NTV Telugu Site icon

ORS : ‘ఓఆర్ఎస్ ద్రావకం‘ పితామహుడు దిలీప్ మహాలనబిస్ కన్నుమూత

Dr Dilip Mahalanabis Father Of Ors Is No More

Dr Dilip Mahalanabis Father Of Ors Is No More

ORS : ఓఆర్ఎస్ ద్రావకం సృష్టి కర్త డాక్టర్ దిలీప్ మహాలనబిస్ కన్నుమూశారు. 88సంవత్సరాల దిలీప్ పలు ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆయన కోల్ కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చనిపోయారు. ఈయన ఓఆర్ఎస్ డాక్టర్ గా ప్రజలకు సుపరిచితుడు.

Read Also: Congress President Election : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్.. ఓటేసిన సోనియా, ప్రియాంక

దిలీప్ మహాలనబిస్ చిన్న పిల్లల వైద్య నిపుణుడు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (కోల్ కతా) లో రీసెర్చ్ స్కాలర్ గా, 1966లో ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ (ఓఆర్టీ) ప్రాజెక్టుపై పనిచేశారు. డాక్టర్ డేవిడ్ ఆర్నలిన్, డాక్టర్ రిచర్డ్ ఏ క్యాష్ తో కలసి పరిశోధనలో పాల్గొన్నారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్ ద్రావకం)ను వీరు తయారు చేశారు. ‘‘ఓఆర్ఎస్ గొప్ప ఆవిష్కరణ. ఈ ఫార్ములేషన్ తయారీ, ఓఆర్టీకి ప్రాచుర్యం కల్పించడంలో మహాలనబిస్ చేసిన సేవలు అపారమైనవి. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సమయంలో కలరా మహమ్మారి కారణంగా మరణాలను తగ్గించడంలో ఓఆర్ఎస్ ఎంతో సాయపడింది’’అని ఐసీఎంఆర్ – నిసెడ్ డైరెక్టర్ శాంతా దత్తా పేర్కొన్నారు.

Read Also:Idli ATM: ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న ఇడ్లీ ఏటీఎం.. ట్వీట్ వైరల్

అంతకు ముందే ఓఆర్ఎస్ ను అభివృద్ది చేసినప్పటికీ.. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలోనే దానికి ప్రాచుర్యం లభించింది. లక్షలాది మంది శరణార్థులు భారత్ లోని సరిహద్దు జిల్లాల్లోకి వలస రావడం చోటు చేసుకుంది. బోంగాన్ శరణార్థి శిబిరంలో కలరా పెద్ద ఎత్తున విజృంభించడంతో అక్కడి బాధితులకు ఓఆర్ఎస్ ను దిలీప్ మహాలనబిస్ అందించారు. దీంతో మరణాల రేటు 30 శాతం నుంచి 3 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత నుంచి ఓఆర్ఎస్ కు ప్రపంచవ్యాప్తంగా ఆమోదనీయం పెరిగింది. 20వ శతాబ్దపు గొప్ప ఆవిష్కరణగా పేరొందింది. ఆయనకు ఎన్నో ప్రఖ్యాత సంస్థల నుంచి అవార్డులు లభించాయి.