NTV Telugu Site icon

Dr BR Ambedkar Statue and Shruti vanam: బీఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవానికి రెడీ..! 19నే ప్రారంభం..

Dr Br Ambedkar

Dr Br Ambedkar

Dr BR Ambedkar Statue and Shruti vanam: విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం, ఆయన విగ్రహ ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వచ్చింది.. అయితే, జనవరి 19న భారీ అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవానికి సన్నహాలు చేస్తున్నారు.. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఈ రోజు సమావేశం అయ్యింది వైసీపీ ఎస్సీ సెల్.. జనవరి 19న అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేయాలని నిర్ణయించారు.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సామాజిక వర్గ నేతలు హాజరు అయ్యే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు.. మరోవైపు.. జనవరి 20వ తేదీన సోషల్ జస్టిస్ డేగా ప్రకటించాలని ప్రతిపాదనలు పెట్టారు.. ఈ సన్నాహక సమావేశానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు ఆదిమూలపు సురేష్‌, మేరుగు నాగార్జున, తానేటి వనిత, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు.

Read Also: CM Revanth Reddy: ముగిసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన.. హైదరాబాద్ రాగానే ప్రెస్ మీట్

ఇక, ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారని ప్రశంసలు కురిపించారు.. 68 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నారని గుర్తుచేశారు. కాగా, చారిత్రాత్మకమైన అంబేద్కర్‌ స్మృతివనం నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచే ప్రాజెక్టు ఇది.. రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప కట్టడమని.. ప్రజల మధ్య ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని, సామరస్యాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుందని గతంలో ఈ ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. నిర్ధేశించుకున్న గడువులోగా అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం పనులను పూర్తి చేయాలని.. స్మృతివనం, విగ్రహం ప్రారంభించేనాటికి ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రిపబ్లిక్‌డే నాటికి పూర్తయ్యే విధంగా.. పనులు చేపడుతున్నామన్న సీఎంకు అధికారులు తెలిపారు.. జనవరి 15 నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు.. జనవరి 24న ప్రారంభోత్సవానికి అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనాన్ని సిద్ధం చేస్తామన్న గతంలో సీఎంకు అధికారులు చెప్పగా.. ఇప్పుడు అంతకంటే ముందుగానే జనవరి 19వ తేదీనే ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.